చేతిలో చేయి వేసి: వల్లభనేని, యార్లగడ్డల మధ్య జగన్ రాజీ

By narsimha lodeFirst Published Oct 8, 2020, 3:46 PM IST
Highlights

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతల మధ్యల రాజీ కుదిర్చేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పనిచేయాలని ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ సూచించారు.


గన్నవరం: గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతల మధ్యల రాజీ కుదిర్చేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పనిచేయాలని ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ సూచించారు.

గురువారంనాడు కృష్ణా జిల్లాలోని  జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ ఇవాళ పునాదిపాడుకు చేరుకొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.  సీఎం స్కూల్ ప్రాంగంణంలోకి వెళ్లే సమయంలో కృష్ణా జిల్లా నేతలు జగన్ కు స్వాగతం పలికారు.

సీఎం జగన్ కు యార్లగడ్డ వెంకట్రావు అభివాదం చేస్తున్న సమయంలో పక్కనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన సీఎం జగన్ యార్లగడ్డ వెంకట్రావు చేతిని వల్లభనేని వంశీ చేతిలో వేశారు,. కలిసి పనిచేయాలని సూచించారు.

ఈ సమయంలో యార్లగడ్డ వెంకట్రావు సీఎం జగన్ కు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే యార్లగడ్డ వెంకట్రావు చెప్పే మాటలను జగన్ వినకుండానే ఆయన కడుపును ఆప్యాయంగా పట్టుకొని కలిసి పనిచేయాలని సూచించి అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఈ తతంగాన్ని పక్కనే ఉన్న వంశీ చూస్తూండిపోయారు. ఇద్దరూ కలిసి పనిచేయాలని జగన్ సూచించారు. అయితే ఈ సూచనను నేతలు ఏ మేరకు పాటిస్తారో చూడాలి.

click me!