రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్: మోడీతో భేటీకి చాన్స్

Published : Apr 28, 2022, 10:30 AM ISTUpdated : Apr 28, 2022, 11:27 AM IST
 రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్: మోడీతో భేటీకి చాన్స్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 29 ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jagan ఈ నెల 29న Delhi కి వెళ్లనున్నారు. ప్రధాని Narendra Modi తో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు.ఈ నెల 30న న్యూఢిల్లీలో జరిగే Judicial Infrastructure seminarసదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  NV Ramana, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. దేశంలో న్యాయ మౌళిక సదుపాయాల కల్పన, కేసు సత్వర పరిష్కారంపై సెమినార్ ను నిర్వహించనున్నారు.

ఈ నెల 5, 6 తేదీల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రానికి సంబంధించి పలు విషయాలపై  ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర విషయాలపై  జగన్ చర్చించారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu