గడప గడపకు మన ప్రభుత్వంపై రేపు సమీక్ష: జగన్‌కి చేరిన నివేదికలు

Published : Dec 15, 2022, 09:46 PM IST
గడప గడపకు మన ప్రభుత్వంపై రేపు సమీక్ష: జగన్‌కి చేరిన నివేదికలు

సారాంశం

గడప గడపకు  మన ప్రభుత్వంపై ఏపీ సీఎం వైఎస్ జగన్  రేపు సమీక్ష నిర్వహించనున్నారు.ఇప్పటికే  ఈ విషయమై సీఎంకు నివేదికలు అందాయి.  గత సమావేశంలోనే  27 మంది ఈ కార్యక్రమంలో వెనుకబడి ఉన్నట్టుగా  సీఎం చెప్పారు.

అమరావతి:  గడప గడపకు మన ప్రభుత్వంపై  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల  16న సమీక్ష నిర్వహించనున్నారు.   రేపు  ఉదయం  11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో  సమీక్ష నిర్వహించనున్నారు సీఎం జగన్.  గత  సమీక్ష సమయంలో  27 మంది  మంత్రులు, ఎమ్మెల్యేలు  వెనుకబడినట్టుగా సీఎం జగన్  చెప్పారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయవద్దని  సీఎం జగన్ సూచించారు.  పద్దతిని మార్చుకోవాలని కూడ సీఎం హెచ్చరించారు.  పద్దతిని మార్చుకోకపోతే  అభ్యర్ధులను మార్చాల్సి వస్తుందని కూడా వార్నింగ్  ఇచ్చారు. 

వచ్చే  ఎన్నికల్లో  రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని  వైసీపీ లక్ష్యంగా  పెట్టుకుంది.  రాష్ట్ర ప్రభుత్వం   అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సీఎం సూచించారు.  అంతేకాదు ప్రజలు ప్రభుత్వం నుండి  ఏం  కోరుకుంటున్నారనే విషయమై సూచనలు, సలహాలు తీసుకోవాలని కూడా సీఎం చెప్పారు.

గడప గడపకు మన ప్రభుత్వాన్ని కొందరు  ప్రజా ప్రతినిధులు సీరియస్ గా తీసుకోవడం లేదని సీఎం  అసంతృప్తిని వ్యక్తం చేశారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  ఎవరెవరు ఎలా పాల్గొంటున్నారనే విషయమై   సీఎం జగన్ కు  నివేదికలు ఇప్పటికే  చేరాయి. ఈ నివేదికల ఆధారంగా సీఎం జగన్  రేపు  గడప గడపకు  మన ప్రభుత్వం కార్యక్రమంలో  ప్రజా ప్రతినిధులకు దిశా నిర్ధేశం  చేయనున్నారు.

also read:సంక్షేమ పథకాల అమలు తీరుపై బూత్ కమిటీల పరిశీలన: మైలవరం వైసీపీ నేతలతో సీఎం జగన్ భేటీ

ఎన్నిసార్లు చెప్పినా  తీరు మార్చుకోని  ప్రజా ప్రతినిదులపై  చర్యలు తీసుకొనే అవకాశం కూడా లేకపోలేదనే ప్రచారం వైసీపీ వర్గాల్లో సాగుతుంది. వచ్చే ఎన్నికలను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని  ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రజల మధ్యే నేతలు ఉండడం కోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని  సీరియస్ గా తీసుకోవాలని సీఎం జగన్  సూచిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Anakapalli Collector Vijaya Krishnan on Ernakulam Tata Nagar train accident | Asianet News Telugu
Nadendla Manohar: రాయచోటి హెడ్ క్వార్టర్స్ మదనపల్లికి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్| Asianet Telugu