స్వర్ణముఖి నదిలో దూకిన కోడిపందెంరాయుళ్లు: తిరుపతి జిల్లాలో ఒకరు గల్లంతు

By narsimha lode  |  First Published Dec 15, 2022, 7:55 PM IST

 కోడి పందెలు నిర్వహకులు పోలీసులను తప్పించుకొనే ప్రయత్నంలో  ఒకరు స్వర్ణముఖి నదిలో  గల్లంతయ్యారు. తిరుపతి జిల్లాలో  ఈ ఘటన చోటు చేసుకుంది.


తిరుపతి: సంక్రాంతి పర్వదినానికి ముందే  తిరుపతి జిల్లాలో  కోడి పందెలు ప్రారంభమయ్యాయి.  పోలీసులను చూసిన పందెంరాయుళ్లు  స్వర్ణముఖి నదిలో  దూకి  పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో  ముగ్గురు నదిలో ఈదుకొంటూ  ఒడ్డుకు  చేరుకున్నారు.  ఒకరు మాత్రం గల్లంతయ్యారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

రేణిగుంట మండలం సుండికండ్రిగ కుమ్మరిపల్లె వద్ద కోడి పందెలు నిర్వహిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు  కుమ్మరిపల్లె  వద్దకు చేరుకున్నారు.  పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన పందెంరాయుళ్లు వెంటనే స్వర్ణముఖినదిలోకి దూకారు.  ఈ నదిలోకి నలుగురు దూకి పోలీసుల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశారు.  ముగ్గురు నదిలో ఈదుకొంటూ  అవతలి ఒడ్డువైపునకు చేరుకున్నారు.  ఒకరు మాత్రం  నదిలో గల్లంతైనట్టుగా సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కోడి పందెలపై నిషేధం ఉంది.  నిషేధం   ఉన్న ఈ ఏడాది జనవరిలో  సంక్రాంతి పర్వదినం సమయంలో  కోడి పందెలు నిర్వహించారు. కోడి పందెల సమయంలో వందల కోట్లు చేతులు మారుతాయి. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  సంక్రాంతి సందర్భంగా కోడి పందెలు నిర్వహిస్తారు.

Latest Videos

సంక్రాంతికి  మరో  నెల  రోజుల సమయం ఉంది.  ఈ సమయంలో  తిరుపతి జిల్లాలో  కోడి పందెం నిర్వహిస్తున్న విషయం వెలుగు చూడడం కలకలం రేపుతుంది.  సంక్రాంతిని పురస్కరించుకొని సరదాగా  ఈ పోటీలను నిర్వహిస్తుంటారు.  కోళ్ల పందెం నిర్వహించడం కోసం బరులు ఏర్పాటు చేస్తారు. కోళ్ల పందెంలో  వయసు తేడా లేకుండా  పాల్గొంటుంటారు. అంతేకాదు  ఈ  పందెలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం వస్తుంటారు.

click me!