ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జానే, యజమానులకు బెదిరింపులు.. తాడేపల్లిలో ల్యాండ్ మాఫియా ఆగడాలు

Siva Kodati |  
Published : Mar 29, 2022, 07:47 PM IST
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జానే, యజమానులకు బెదిరింపులు.. తాడేపల్లిలో ల్యాండ్ మాఫియా ఆగడాలు

సారాంశం

ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత స్థలంలోకి వెళ్లాలంటే కప్పం కట్టాలంటూ ముగ్గురు యువకులు స్థల యజమానులను డిమాండ్ చేస్తున్నారు. 

ల్యాండ్ మాఫియాపై (land maifa) తాడేపల్లి పోలీసులు (tadepalli police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఖాళీ స్థలాలపై కన్నేసిన ల్యాండ్ మాఫియా.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చిన్నపాటి పాక వేసి స్థల యజమానినీ బెదిరిస్తోంది. తాడేపల్లి పట్టణంలోని డోలాస్ నగర్‌లో (dolas nagar) గత కొంతకాలంగా గ్యాంగ్‌లుగా ఏర్పడి ఖాళీ స్థలాలు కబ్జాలు చేస్తున్నారు కొంతమంది యువకులు. సొంత స్థలంలోకి వెళ్లాలంటే కప్పం కట్టాలంటూ ముగ్గురు యువకులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులను బెదిరిస్తూ.. నగదు డిమాండ్ చేస్తూ, భయబ్రాంతులకు గురి చేసింది ఈ ముఠా. 

దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. అనంతరం భూకబ్జాకు పాల్పడుతున్న డోలాస్ నగర్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, భూకబ్జాలు చేసినా కఠిన చర్యలు తప్పవని తాడేపల్లి పోలీసులు హెచ్చరించారు. భూకబ్జాల్లో మరికొందరు ఉన్నట్లు తెలిసిందని వారిపై కూడా ఫిర్యాదులు వచ్చాయని, త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు ఎవరైనా కబ్జాదారులకు భయపడి నగదు చెల్లించి ఉంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం