ఈ నెల 9న ఒడిశా టూర్‌కి ఏపీ సీఎం వైఎస్ జగన్: జల వివాదాలపై చర్చ

By narsimha lode  |  First Published Nov 4, 2021, 10:52 AM IST

అమరావతి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన ఒడిశా టూర్ కు వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న జల వివాదాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో జగన్ చర్చించనున్నారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంంత్రి YS Jagan ఈ నెల 9వ తేదీనOdisha వెళ్లనున్నారు. ఒడిశా సీఎం Naveen patnaikతో జగన్ భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నజల వివాదంపై జగన్ చర్చించనున్నారు.

Neradi barrage  బ్యారేజీతో పాటు Polavaram Project నిర్మాణంపై కూడ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి.ఈ వివాదాల పరిష్కారం కోసం ఏపీ సీఎం జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చించనున్నారు.

Latest Videos

undefined

నేరడి  వద్ద బ్యారేజీ నిర్మిస్తే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ గతంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ రాశాడు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం ట్రిబ్యునల్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  ఈ బ్యారేజీ నిర్మాణంతో ఒడిశాలో 30 వేల ఎకరాలతో పాటు ఏపీలో  20వేల ఎకరాలకు సాగునీరు అవుతుంది.

also read:ప్రేమోన్మాది దాడిలో మరణించిన యువతి కుటుంబాన్ని ఆదుకున్న సీఎం జగన్‌.. రూ. 10 లక్షల ఆర్థిక సాయం

మొత్తం 115 టీఎంసీలలో ఆంధ్రా 57.5 టీఎంసీల నీటిని ఉపయోగించుకొనే వీలుంది.అయితే బ్యారేజీని నిర్మించని కారణంగా ప్రస్తుతం కేవలం 45 టీఎంసీల నీటిని మాత్రమే ఉపయోగించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.  బ్యారేజీని నిర్మిస్తే దానికి అనుసంధానంగా కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి, ఎడమ కాలువ ద్వారా ఒడిశాకు నీటిని మళ్లించవచ్చు. ఈ బ్యారేజీ నిర్మాణ ఖర్చులో 10 శాతాన్ని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 

ఈ బ్యారేజీ నిర్మాణంపై ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినా కూడా ఒడిశా సర్కార్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.ఈ అభ్యంతరాలను ఏపీ రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ అధికారులు నివృత్తి చేశారు.. ఇంకా ఏమైనా వివాదాలు ఉంటే ఆంధ్రా, ఒడిశా, కేంద్రం నుంచి ఏర్పాటు చేసిన ముగ్గురు సీఈల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా కోర్టుకు వెళ్లనవసరం లేదని క్లియరెన్స్‌ ఆర్డర్‌ ఇచ్చింది.

ఒడిశా టూర్ లో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలతో పాటు ఇతర అంశాలపై సీఎం జగన్ నవీన్ పట్నాయక్ తో చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం Polavaram Project  అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గతంలో సుప్రీంకోర్టులో ఒడిశా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని ఒడిశా సర్కార్ ఆరోపించింది. 

తెలంగాణ రాష్ట్రంతో ఏపీ ప్రభుత్వానికి కూడా జలవివాదాలున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులపై ఏపీ రాష్ట్రం ఫిర్యాదులు చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా తెలంగాణ సర్కార్ ఫిర్యాదులు చేసింది. దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులను  కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

గోదావరి పై ఉన్న ఒక్క ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొచ్చే అంశంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు నేతృత్వంలో కేసీఆర్ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక తర్వాత కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించే విషయమై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

click me!