
ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆదుకున్నారు. ఆ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం (Financial Assistance) అందజేశారు. ఆ యువతి సోదరుడికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వివరాలు.. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన వీరమల్ల పెద్ద జమలయ్య, ఏసమ్మల కుమార్తె చిన్నారిని విజయవాడ హనుమాన్‌పేటలో గత ఏడాది అక్టోబర్‌లో అదే గ్రామానికి చెందిన నాగభూషణం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దుర్ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
Also read: ఏపీలో అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక సంక్షేమ శాఖ.. జీవో జారీ చేసిన జగన్ సర్కార్
యువతి కుటుంబ పరిస్థితిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సీఎం జగన్ ఆ కటుంబాన్ని ఆదుకున్నట్టుగా సీఎం కార్యాలయం తెలిపింది.
Also read: తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి.. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ఇక, బుధవారం యువతి తల్లిదండ్రులు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. వారి వెంట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణా ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. రూ. 10 లక్షల చెక్‌ను వెంటనే ఇవ్వాలని ఆదేశించడంతో, సీఎంవో అధికారులు బాధిత కుటుంబానికి చెక్ అందజేశారు. అంతేకాక మృతురాలి సోదరుడికి కూడా వెంటనే అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగాన్ని కల్పిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎంవో అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.