ఒకటో తరగతిలోనే పోటీ పరీక్షలకు బీజం .. విద్యారంగంలో సమూల మార్పులు: వైఎస్ జగన్

By Siva KodatiFirst Published Nov 26, 2021, 5:00 PM IST
Highlights

రాష్ట్రంలో  ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys jagan) . ఒకటో తరగతిలో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని జగన్  తెలిపారు. 

రాష్ట్రంలో  ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys jagan) . శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో పెను మార్పులు చేశామని జగన్ తెలిపారు. ఒకటో తరగతిలో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని జగన్  తెలిపారు. రైటు టు ఇంగ్లీష్ మీడియం (english medium) ఎడ్యుకేషన్ మారుస్తున్నామని సీఎం చెప్పారు. అంగన్‌‌వాడి నుంచి ఇంగ్లీష్ మీడియం వైపు పిల్లలను మళ్లీంచాలని ... విద్యాపరంగా సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని  జగన్ తెలిపారు. విద్యారంగంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపడుతున్నామని సీఎం చెప్పారు. 

20 మంది పిల్లలకు ఒక టీచర్ ఏర్పాటు చేస్తామని.. పిల్లలను బాగా చదివించేందుకు జగనన్న గోరుముద్ద (jagananna gorumudda) తీసుకొచ్చారని జగన్ వెల్లడించారు. అమ్మఒడి పథకంలో విద్యార్ధుల తల్లులను భాగస్వాములను చేశామని.. 44.50 లక్షల మంది విద్యార్ధుల తల్లులకు లబ్ధి చేకూరుస్తున్నామని ఆయన చెప్పారు. సబ్జెక్ట్‌ల వారీగా టీచర్లను నియమిస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం (amma odi scheme) ద్వారా 85 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి కలుగుతుందన్నారు. అమ్మఒడి పథకం క్రింద ఏడాదికి రూ.6,500 కోట్లు కేటాయించామని.. గోరుముద్ధ పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చామని జగన్ చెప్పారు. 

Also Read:విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఏపీ అసెంబ్లీలో వరదలపై జగన్

విద్యార్ధులకు విద్యాకానుక, తల్లులకు అమ్మఒడి అందజేస్తున్నామని.. గోరుముద్ధ కోసమే రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. అమ్మఒడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్నారు. రెండేళ్ల కాలంలో అమ్మఒడి పథకానికి రూ.13,023 కోట్లు కేటాయించామన్నారు. గతంలో చదువుకునే స్థాయి నుంచి చదువుకొనే స్థాయికి తెచ్చారని.. గత ప్రభుత్వం స్కూళ్లను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌కు పట్టం కట్టారని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 7.18 లక్షల మంది విద్యార్ధులు  పెరిగారని ఆయన చెప్పారు. నాడు- నేడుతో విద్యారంగంలో (nadu nedu schools) సమూల మార్పులు తెచ్చామని సీఎం అన్నారు. 

అంతకుముందు అసెంబ్లీలో జగన్ వరదలతో కలిగిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి మాట్లాడారు. ఆకాశానికే చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా వాటిల్లిందని సీఎం అభిప్రాయపడ్డారు.పింఛ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇన్‌ఫ్లో వచ్చిందని సీఎం జగన్ చెప్పారు.చెయ్యేరు నది పరివాహక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.tirupati, శేషాచలం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం మొత్తం చెయ్యేరులోకి చేరిందని సీఎం తెలిపారు.చెయ్యేరు. వరద ఉధృతిలో ఓ బస్సు కూడా చిక్కుకుపోవడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. వరద ఉధృతికి ప్రాజెక్టుల కట్టలు కూడా తెగిపోయాయన్నారు. ఏడాదిలో ఒక్క సారి కూడా నిండని జలాశయాలు ఒకటి రెండు రోజుల్లోనే నిండిపోయాయని చెప్పారు. 

గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఒక్క చోటు శాశ్వతంగా కనుమరుగు అవుతానని తనపై చంద్రబాబు (chandrababu naidu) చేసిన విమర్శలపై కూడా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తనను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కాల గర్భంలో కలిసిపోయాడని చంద్రబాబు విమర్శలు చేసిన కామెంట్స్ ను జగన్ అసెంబ్లీలో చదివి విన్పించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడు, ఏం మాట్లాడో అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు అంటూ జగన్ సెటైర్లు వేశారు. 
 

click me!