చీర కొనుక్కుందని.. ఇటుక రాయితో కొట్టి భార్యను హత్య చేసిన భర్త..

Published : Nov 26, 2021, 04:57 PM IST
చీర కొనుక్కుందని.. ఇటుక రాయితో కొట్టి భార్యను హత్య చేసిన భర్త..

సారాంశం

తాగుడు, జూదానికి బానిసైన అతను ఇంటి బాధ్యత వదిలేశాడు. వీరికి ఒక కుమార్తె పుట్టింది. ఇల్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడటంతో దానమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేసి భర్త, అత్త మామలను పోషించేది.మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్ ఆమె భిక్షాటన చేసి తీసుకొచ్చిన సొమ్ము కూడా లాక్కునేవాడు. దానమ్మ గర్భిణి అని చూడకుండా తీవ్రంగా కొట్టడంతో 20 రోజుల క్రితం ఆమెకు గర్భస్రావం అయ్యింది. 


పశ్చిమగోదావరి జిల్లా : ప్రేమించానంటూ వెంటపడ్డాడు. అతనిని నమ్మి పెళ్లి చేసుకున్న ఆ యువతికి భర్త నరకం చూపించాడు. చివరకు అతనే కర్కశంగా హతమార్చాడు. చీర కొనుక్కుందన్న కోపంతో ఇటుక రాయితో తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. ఈ ఘటన  west godavari districtలో జరిగింది.

నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలేనికి చెందిన కళ్యాణం దుర్గా ప్రసాద్, పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన దానమ్మ పెద్దలను ఎదిరించి love marriage చేసుకున్నారు. దానమ్మ తల్లిదండ్రులు బూరలు, రబ్బర్ బ్యాండ్లు, చెంపపిన్నులు.. వంటి సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్ కూడా అదే వృత్తి చేసేవాడు. 

తాగుడు, జూదానికి బానిసైన అతను ఇంటి బాధ్యత వదిలేశాడు. వీరికి ఒక కుమార్తె పుట్టింది. ఇల్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడటంతో దానమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో Begging చేసి భర్త, అత్త మామలను పోషించేది. alcoholకి బానిసైన దుర్గాప్రసాద్ ఆమె భిక్షాటన చేసి తీసుకొచ్చిన సొమ్ము కూడా లాక్కునేవాడు. దానమ్మ గర్భిణి అని చూడకుండా తీవ్రంగా కొట్టడంతో 20 రోజుల క్రితం ఆమెకు abortion అయ్యింది. 

ఇటీవల భర్తకు తెలియకుండా రూ.200తో చీర కొనుక్కుందని తెలిసి ఆమెతో బుధవారం రాత్రి తొమ్మిది నుంచి పదిగంటల మధ్య గొడవ జరిగింది. అత్త మరిడమ్మ కూడా అతనికి తోడైంది. ఈ గొడ పెరిగి పక్కనే ఉన్న Brickతో దానమ్మను తీవ్రంగా కొట్టాడు. బాధ తట్టుకోలేక ఆమె అరిచిన అరుపులకు రాత్రి పదిగంటల సమయంలో చుట్టుపక్కలవారు పోగయ్యారు. 

దెబ్బలకు దానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. దానమ్మ భర్త, అత్త కొట్టి చంపారని మృతురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి గూడెం రూరల్ సీఐ రవికుమార్, నల్లజర్ల ఎస్ ఐ అవినాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గృహహింసకు పాల్పడినందుకు, అబార్షన్ కు కారణమైనందుకు భర్త, అత్త మీద కేసు నమోదు చేశారు. తల్లిని కోల్పోయిన ఏడాది వయసున్న చిన్నారి ఏం జరిగిందో తెలియక బిత్తర చూపులు చూస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. 

మచిలీపట్నలో దారుణం... కన్న తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిచంపిన కసాయి కొడుకు

ఇదిలా ఉండగా, మచిలీపట్నంలో నవమాసాలు కడుపున మోసి జన్మనిచ్చిన తల్లినే అతి కిరాతకంగా హతమార్చాడో కసాయి కొడుకు. పెళ్లి చేయాలంటూ తల్లితో గొడవపడ్డ తనయుడు ఆవేశంలో తల్లిపై క్రికెట్ బ్యాట్ తో దాడిచేసి హతమార్చాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... krishna district ప్రధాన కేంద్రం మచిలీపట్నం పరాస్ పేటలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ సమీపంలో చింతరాజు - వెంకటేశ్వరమ్మ దంపతులు కొడుకు హరీష్ రావుతో కలిసి నివాసముటున్నారు. అయితే హరీష్ తనకు పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేయడంతో వారు సంబంధాలు చూస్తున్నారు. బంధువులతో పాటు తెలిసినవారి ద్వారా చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఏ సంబంధమూ పెళ్లివరకు వెళ్లలేదు. 

కొంతకాలంగా ఇలాగే సంబంధాలు రావడం... పెళ్లి కుదరకపోవడంతో హరీష్ డిప్రెషన్ కు గురయ్యాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలోనే తల్లీ కొడుకుల మధ్య గురువారం మరోసారి పెళ్లి విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కన్నతల్లిపైనే క్రికెట్ బ్యాట్ తో దాడిచేసాడు. 

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu