ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఇవాళ అసెంబ్లీలో ప్రసంగించిన జగన్ గవర్నర్ బడ్జెట్ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును తప్పు బట్టారు.
అమరావతి: చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం వల్ల ఎవరికి ఉపయోగమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో సీఎం YS Jagan ప్రసంగించారు.
గవర్నర్ బడ్జెట్ ప్రసంగం సమయంలో TDP సభ్యులు వ్యవహరించిన తీరుపై సీఎం జగన్ మండిపడ్డారు. గవర్నర్‌ను అవమానించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Chandrababu సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియట్లేదన్నారు. Governor వయసుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిదీ అని ఆయన గుర్తు చేశారు.
గవర్నర్ పట్ల ఇటువంటి ప్రవర్తనతో గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. . తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా చేయలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు.
చంద్రబాబు చెప్పుకునేందుకు ఒక్క పథకమైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అంటే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు అంటూ జగన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలకు ఆయన ఇచ్చిన విలువ ఏమిటని సీఎం జగన్ ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలపై చంద్రబాబుకు కడుపు మంట అని జగన్ వ్యాఖ్యానించారు.
తాను ఇచ్చిన మాట నిలుపుకున్నానని ప్రజలు నమ్మారని సీఎం జగన్ చెప్పారు. అందుకే ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు YCPకే పట్టం కట్టారన్నారు. ఆఖరికి Kuppam లో కూడా ప్రజలు వైసీపీని గెలిపించారని సీఎం జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.
చంద్రబాబు నాయుడు సర్కార్ లంచాలు తీసుకోకుండా ఏ పథకాన్ని కూడా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. 34 నెలల కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థల్లో మార్పులు తెచ్చామన్నారు. ఎవరి పాలన బాగుందో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. కొత్త జిల్లాలతో పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చట్టామన్నారు. చంద్రబాబు నాయుడు తాను సీఎంగా ఉన్న సమయంలో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయలదేన్నారు. కానీ ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో రెవిన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారన్నారు. మరో వైపు Hindupuram పట్టణాన్ని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని Bala krishna ఆందోళనలు చేస్తున్నారని జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు తనకు విజన్ ఉందని చెప్పుకుంటాడన్నారు. అంత విజన్ ఉన్న నాయకుడు కుప్పంలో రెవిన్యూ డివిజన్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఎంత విజన్ ఉందో ప్రజలే ఆలోచించాలని సీఎం జగన్ చెప్పారు.
చంద్రబాబు హయంలో చైతన్య, నారాయణ కాలేజీలకు లబ్ది చేకూరేలా పనిచేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్ ను బలోపేతం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఎమ్మెల్యేల రికమండేషన్ తీసుకొనేలా వాటిని అభివృద్ది చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియం చదవాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. అమ్మ ఒడి పథకం పెట్టాలని చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని జగన్ ప్రశ్నించారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్ధుల హాజరు శాతం పెరిగిందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలుపుకోలేదన్నారు. మహిళలను రోడ్డుకు లాగారని జగన్ మండిపడ్డారు.