Janasena: ఎట్టకేలకు జనసేన ఆవిర్భావ సభకు గ్రీన్ సిగ్న‌ల్.. జ‌న‌సేనాని స్పీచ్ కోసం ఫ్యాన్స్ వేటింగ్

Published : Mar 10, 2022, 12:18 AM IST
Janasena: ఎట్టకేలకు జనసేన ఆవిర్భావ సభకు గ్రీన్ సిగ్న‌ల్.. జ‌న‌సేనాని స్పీచ్ కోసం ఫ్యాన్స్ వేటింగ్

సారాంశం

Janasena: ఎట్టకేలకు జనసేన ఆవిర్భావ సభకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. ఈనెల 14వ తేదీన తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వ‌హించ‌డానికి ఏపీ పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. దీనికి కొన్ని గంటల ముందే.. జగన్ ప్రభుత్వం, పోలీసుల తీరును విమర్శిస్తూ.. నాదెండ్ల మనోహర్ ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యారు.  

Janasena:  జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. త‌మ పార్టీ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వాలని జనసేన నాయ‌కులు అభ్య‌ర్థించారు. కానీ, ప్ర‌భుత్వం వారి అభ్య‌ర్థ‌న‌ను పట్టించుకోలేదు. దీంతో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రెస్‌మీట్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సభకు అనుమతి ఇవ్వకపోతే.. హైకోర్టుకు వెళతామని హెచ్చరించారు. దీంతో పోలీస్ శాఖ అనుమతి మంజూరు చేసింది. పార్టీ ఆవిర్భావ‌ దినోత్సవ సభకు అనుమతి ఇవ్వడంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల  ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల భేటీ అయ్యారు.. సభకు వచ్చే వారి రవాణా, పార్కింగ్ ఏర్పాట్ల పైనే ప్రత్యేక దృష్టి సారించారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అయితే, జనసేన సభకు జ‌గ‌న్ ప్రభుత్వం అనుమతి వస్తుందా? లేదా? అనే అనుమానాలు   జనసేన నేతలు వ్యక్తం చేశారు. గత నెల 28వ తేదీన సభ నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని.. సహకరించాలని ఏపీ డీజీపీ కోరినా సహకరించడం లేదని విమర్శించారు. ఈ స‌మావేశ అనంత‌రం
అనంత‌రం  పార్టీ ఆవిర్భావ‌ దినోత్సవ సభకు ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వడంతో జనసేన హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో  జ‌న‌సేనాని  పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈనెల 14వ తేదీన తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జ‌రుగ‌నున్న‌ది. ఈ స‌మావేశానికి   మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు సభకు అనుమతి ఇచ్చారు ఏపీ పోలీసులు. కాగా, జనసేన ఆవిర్భావ సభా వేదికకు రాజకీయాలలో ఆదర్శంగా ఉన్న మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభా వేదికగా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. కీలకమైన కార్యాచరణ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ స‌మావేశానికి లక్షల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు  తరలిరానున్నారని,  సభ నిర్వహణ కోసం‌ 12 కమిటీలు పని చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu