Andhra Pradesh: కేసీఆర్ ఎఫెక్ట్.. ఆంధ్ర‌లో నిరుద్యోగులు, ప్ర‌తిప‌క్షాల ఆందోళన !

Published : Mar 10, 2022, 04:09 PM IST
Andhra Pradesh: కేసీఆర్ ఎఫెక్ట్.. ఆంధ్ర‌లో నిరుద్యోగులు, ప్ర‌తిప‌క్షాల ఆందోళన !

సారాంశం

Andhra Pradesh: రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొన్నిరోజులుగా నిరుద్యోగులు నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా 90 వేల‌కు పైగా ఉద్యోగాల‌ను నోటిఫై చేశామ‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వెంట‌నే ప్ర‌భుత్వం విభాగాల్లోని ఖాళీల‌కు నోటిఫికేష‌న్లు జారీ చేయాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు, నిరుద్యోగులు సీఎం వైస్ ఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ  ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.   

Andhra Pradesh: రాష్ట్రాలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ  వెంట‌నే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత‌లు, నిరుద్యోగ యువ‌కులు  గురువారం నాడు రాష్ట్ర శాసనమండలి భవనం దగ్గర నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ డిమాండ్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు.

2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నిరుద్యోగ యువతకు ద్రోహం చేశారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు సహా శాసనసభ్యులు.. "చంద్ర‌బాబు పాల‌న‌లో యువ‌త‌కు ఉద్యోగాలు.. జ‌గ‌న్ రెడ్డి పాన‌లో ఉద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని" పేర్కొంటున్న బ్యాన‌ర్ ను ప‌ట్టుకుని నిర‌స‌న తెలిపారు. 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు సహా శాసనసభ్యులు ‘జగన్‌ రెడ్డి ఉద్యోగాలు ఎక్కడ?’ అనే బ్యానర్‌ను పట్టుకున్నారు. వైకాపా నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వ విభాగాల్లో ఖాళీల‌ను వెంట‌నే నింపాల‌నీ, నిరుద్యోగ‌ల కోసం నోటిఫికేష‌న్లు జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పాల‌న‌లో రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు అందితే.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైపాకా పాల‌న‌లో యువ‌త‌కు ఉపాది క‌రువైంద‌నీ, ఉద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఆరోపించారు. 

ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల ప్ర‌క‌ట‌న చేసిన ఒక‌రోజు త‌ర్వాత ఏపీలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ నేత‌లు ఉద్యోగ ఖాళీల భ‌ర్తి కోసం ఆందోళ‌న‌కు దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం నాడు 91,142 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, 80,039 ఖాళీల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.

ఉద్యోగాలు కల్పించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఉపనేత జి. బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగమే ప్రధాన సమస్యగా పేర్కొంటూ, దాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. “తెలంగాణ ప్రభుత్వం 90,000 ఖాళీలను భర్తీ చేయగలిగినప్పుడు, ఇక్కడ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది,” అని టీడీపీ నాయకుడు ప్రశ్నించారు. సూప‌ర్‌యాన్యుయేష‌న్‌పై ఉద్యోగుల రిటైర్మెంట్‌తో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం నియామకాలు చేపట్టడం లేదని ఆరోపించారు.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu