దిశ నిందితుల ఎన్‌కౌంటర్: అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Dec 13, 2019, 3:02 PM IST
Highlights

దిశ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు

అమరావతి: ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని ఆమోదించింది. దిశ చట్టానికి ఏపీ అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి హాట్సాప్ అంటూ ప్రశంసలు కురిపించారు.

శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.  వ్యవస్థలో మార్పు కోసమే ఈ చట్టం తీసుకొచ్చినట్టుగా జగన్ తెలిపారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం విచారణ సరికాదని జగన్ తేల్చి చెప్పారు. అత్యాచారం తప్పే అయినా పోలీసులు కాల్చటం తప్పు అంటారా అని ఆయన ప్రశ్నించారు. అలా అయితే భవిష్యత్తులో పోలీసులు ఎవరూ కూడ ముందుకు రారని జగన్ అభిప్రాయపడ్డారు.

Also Read:సత్వర న్యాయం: ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు ఇవే..

దారుణంగా రేప్ చేసినా నిందితులను శిక్షించాలంటే ఏ ప్రభుత్వం ముందుకు రాదని జగన్ చెప్పారు. కఠినంగా శిక్షలు పడకపోతే తప్పులు చేసిన వారు యధేచ్చగా బయట తిరుగుతారని జగన్ చెప్పారు.

నిందితులకు సత్వరమే శిక్ష పడేందుకుగాను ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా జగన్ తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందని  ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో నమోదైన కేసుల గురించి 2014 లో 930, 2015లో 1014, 2016లో 969, 2016లో 1045, 2018లో 1095 సీఎం జగన్ సభలో గణాంకాలను వివరించారు.

మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు సంబంధించిన ఆధారాలు ఉంటే మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకొన్నట్టుగా  ఏపీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.. మరో చట్టంలో నిందితులు రాష్ట్రపతి వద్దకు వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకొన్నామన్నారు.

Also read:జగన్‌కు ధన్యవాదాలు, దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయండి: దిశ తండ్రి

రాష్ట్రంలోని 13 జిల్లాలో 13 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్టుగా సీఎం జగన్ తెలిపారు. దిశకు న్యాయం జరగాలని దేశం మొత్తం కోరుకొన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. నేరం చేసిన వారెవరూ కూడ తప్పించుకోకుండా ఉండాలనేది తమ అభిమతమన్నారు. నిందితులకు మరణశిక్ష పడేలా ఐపీఎస్ సెక్షన్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకొన్నామన్నారు.
 

click me!