దిశ చట్టం నేరస్తులకు సింహస్వప్నం: మంత్రి తానేటి వనిత

By Nagaraju penumalaFirst Published Dec 13, 2019, 1:54 PM IST
Highlights

ఏపీ దిశచట్టం ఒక నవశకానికి దారి తీస్తోందని వనిత స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత అత్యంత వేగంగా దర్యాప్తు, దోషులకు శిక్ష నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారులపై దాడులను నియంత్రించేందుకు జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి తానేటి వనిత. దిశ చట్టం మహిళలకు ఒక శ్రీరామ రక్ష అంటూ కొనియాడారు. చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.  

ప్రస్తుత కాలంలో రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై రోజూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని అయితే అవి చాలా వరకు బయటకు రావడం లేదని చెప్పుకొచ్చారు. మహిళల పక్షాన ఎంతో మానవత్వంతో ఆలోచించిన జగన్‌ ఈ చట్టం చేయడం శుభపరిణామమన్నారు. 

మహిళలను దేవతలుగా భావించే ఈ గడ్డపై నిత్యం ఎన్నో దాడులు, అత్యాచారాలు జరుగుతుండటం భయాన్ని కలిగిస్తోందన్నారు. ఇకపోతే విశాఖ జిల్లా మాడుగుల మండలం వాకపల్లిలో శ్రీదేవి అనే గిరిజన మహిళపై అత్యాచారం జరగడం బాధాకరమన్నారు.  

ఇకపోతే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహాశీల్ధార్ వనజాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టడం చూశామని అయితే ఆనాడు చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకువచ్చారని మండిపడ్డారు.  

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోచటు చేసుకున్న దిశ ఘటనపై యావత్ దేశమంతా ఆగ్రహంతో రగిలిపోయిందన్నారు. ప్రజలంతా సత్వర న్యాయం కోరిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు మంత్రి వనిత. 

బాత్ రూమ్ దగ్గర దాక్కునేవాళ్లం,.. వాళ్ళ అంతలా వేధించారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన..

చిన్నారులపై కూడా జరుగుతున్న దారుణాలను చూసి కఠిన చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకతపై ఒక మహిళగా తల్లిగా తనకు బాధకలిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలకు ఎంతో అండగా నిలుస్తూ సీఎం జగన్‌ ఒక చట్టం తీసుకురావడం ఎంతో శుభపరిణామమన్నారు. 

గత ప్రభుత్వం పాలు పోసి పోషించిన కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ను కూడా చూసినట్లు చెప్పుకొచ్చారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆ కేసులో నిందితులు ఎక్కడ దొరికిపోతారో అన్న ఆందోళనతో తప్పించుకునేందుకు ఆనాడు అంబేడ్కర్‌ స్మృతి వనం పేరుతో సభలో చర్చకు తెరలేపారని ఆరోపించారు.   

కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి తానేటి వనిత. చంద్రబాబు హయాంలో శాంతి భద్రతలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. 

ఆనాడు గ్రామాల్లో మంచినీరు దొరక్కపోయినా, మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరికిందన్నారు. తన నియోజకవర్గంలో ఆ నాటి సీఎం చంద్రబాబు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బెల్టుషాపులు ఉంటే తోలు తీస్తామని హెచ్చరించారు గానీ ఆ పనిమాత్రం చేయలేదన్నారు.  

కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగిపోయాయన్నారు. అంతే కాకుండా మద్యం షాపులు కూడా తగ్గించారని నాలుగు దశల్లో మద్యపాన నిషేధం జరుగుతుందని తెలిపారు.  

చంద్రబాబు గిల్లుడుకు ఆ ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే రాజా...

రాష్ట్రంలో మద్యపాన నిషేధంపై మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలు, పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అలాంటివి జరగకుండా ఉండాలంటే చట్టాలు కఠినంగా ఉండాలన్నారు. 

దోషులకు చాలా వేగంగా శిక్ష పడేలా సీఎం జగన్ చట్టం తీసుకురావడంపట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంతో ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని మించిపోయారని చెప్పుకొచ్చారు. 

జగన్ పాలనను చూసి ప్రతీ ఒక్కరూ జగన్‌మోహనుడేనని కొనియాడుతున్నారని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పనులను ప్రపంచం అంతా ఆసక్తిగా గమనిస్తోందన్నారు.  

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు, మహిళలకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. అందువల్లే డిప్యూటీ సీఎం పదవితో పాటు, మంత్రివర్గంలో కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారన్నారు. 

ఏపీ అసెంబ్లీలో దిశ చట్టం, మృగాలకు ఉరే సరైన శిక్ష:హోంశాఖ మంత్రి సుచరిత...

ఒక దళిత మహిళకు హోం శాఖ ఇవ్వడం నిజంగా ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం, వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇవ్వడం ఒక చరిత్రాత్మక నిర్ణయమన్నారు. 

మహిళల భద్రత కోసం ప్రత్యే చట్టం రూపొందించిన జగన్ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిల్చారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు.  

ఏపీ దిశచట్టం ఒక నవశకానికి దారి తీస్తోందని వనిత స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత అత్యంత వేగంగా దర్యాప్తు, దోషులకు శిక్ష నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. 

మహిళలను అవమానపర్చినా, సోషల్‌ మీడియాలో పోస్టు చేసినా శిక్షించాలన్న నిర్ణయం మహిళలకు ఎంతో భరోసా ఇస్తుందన్నారు. మహిళలపై అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు నేరస్తులకు ఒక సింహస్వప్నమన్నారు. నేరం చేయడానికి వారు భయపడేలా చేస్తుందని వనిత అభిప్రాయపడ్డారు.   

సభలో వైసీపీకి టీడీపీ ట్విస్ట్: జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు...

click me!