బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు డ్రామాలు ఆడిస్తున్నాడని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.
అమరావతి: . బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు డ్రామాలు ఆడిస్తున్నాడని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.
రైతు భరోసా-పీఎం కిసాన్ 3వ విడత నిధులను ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు.
తమ ప్రభుత్వం తేదీల వారీగా కార్యక్రమాలను ప్రకటించి వాటిని అమలు చేస్తోందని చెప్పారు.ఇప్పటివరకు తాము ప్రకటించిన తేదీల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే చంద్రబాబునాయుడు రైతులపై ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాడని ఆయన విమర్శించారు.
తన పుత్రుడిని దత్తపుత్రుడిని రంగంలోకి దించి ప్రభుత్వంపై విమర్శలకు దింపుతున్నాడని పవన్ కళ్యాణ్, లోకేష్ లపై జగన్ విమర్శలు గుప్పించారు.
మళ్లీ వాళ్లిద్దరిపై చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు. వాళ్లిద్దరికీ రైతుల కష్టాలు పట్టవని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో కనీసం ఆ పుత్రుడు నోరు మెదపలేదన్నారు.కాయలు కాసే చెట్టుపైనే రాళ్లు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు