కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నానని ఈ కారణంగా తాను కొన్నాళ్ల పాటు ప్రయాణాలు చేయలేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు.
అమరావతి: కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నానని ఈ కారణంగా తాను కొన్నాళ్ల పాటు ప్రయాణాలు చేయలేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమను అవమానపర్చేలా ఎస్ఈసీ వ్యవహరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రెండు దఫాలు సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఈ నెల 18న నోటీసులు జారీ చేసింది.
also read:ఏపీ సర్కార్ ఎస్ఈసీ మధ్య ముదురుతున్న వార్: నిమ్మగడ్డకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు
వివరణకు అందుబాటులో కూడ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం నాడు(ఈ నెల 20న) సమాధానం ఇచ్చారు.తాను ఎక్కడా కూడ ఎమ్మెల్యేల హక్కులకు భంగం కల్గించలేదని స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీలోకి తాను రాలేనని ఆయన చెప్పారు. అసెంబ్లీపై తనకు అత్యున్నత గౌరవం ఉందని ఆయన తెలిపారు.
ఈ విషయమై ఇంకా ముందుకు వెళ్లాలనుకొంటే ఆధారాలతో సరైన సమయంలో స్పందిస్తానని ఆయన తేల్చి చెప్పారు. తాను కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నందున ప్రయాణాలు చేయలేనని ఆయన ఈ సమాధానంలో స్పష్టం చేశారు.