కోవిడ్ ఆసుపత్రులకు రేటింగ్ ఇవ్వాలి: సీఎం జగన్

By narsimha lodeFirst Published Aug 21, 2020, 3:28 PM IST
Highlights

రాష్ట్రంలో కోవిడ్ ఆసుపత్రుల సంఖ్య 138 నుండి 287కు పెంచుతున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

అమరావతి:  రాష్ట్రంలో కోవిడ్ ఆసుపత్రుల సంఖ్య 138 నుండి 287కు పెంచుతున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

స్సెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం కోరారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు,వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.

ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆయన కోరారు. అందిస్తున్న సేవలకు అనుగుణంగా కోవిడ్‌ ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలన్నారు.

ఇప్పుడున్న 287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్త స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు. 

నిరంతరంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలన్నారు. కోవిడ్‌ కాల్‌ సెంటర్‌లు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. 
ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. 

పారిశుద్ధ్యం బాగుండాలి చికిత్స తీసుకుంటున్నవారికి మంచి భోజనం అందించాలని సీఎం సూచించారు.హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

మందులు ఇవ్వడం చికిత్స అందించడంతో పాటు సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం అధికారులను కోరారు.విలేజ్, వార్డు క్లినిక్స్‌ నుంచి ఈ ప్రోటోకాల్‌ అమలు జరగాలన్నారు.

ఆరోగ్యశ్రీ సేవల సమాచారం తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదులు చేయడానికి వీలుగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఈనంబర్‌ను అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో బోర్డుల్లో ఉంచాలన్నారు.

పేషెంట్‌ను ట్రీట్‌చేయకుండా అవసరంలేకుండా రిఫర్‌ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చెప్పాలన్నారు. ఆరోగ్య ఆసరా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.

డెలివరీ అవగానే తల్లికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలును పరిశీలించాలని సీఎం అధికారులకు కోరారు. ఆస్పత్రి నుంచి తల్లి, బిడ్డ డిశ్చార్జి అవుతున్నప్పుడే డబ్బులు వారి అక్కౌంట్లో పడాలన్నారు.

click me!