ఫోన్ ట్యాపింగ్ కేసు: 16 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Aug 21, 2020, 1:55 PM IST
Highlights

ఫోన్ ట్యాపింగ్  కేసులో 16 మందికి  ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

 అమరావతి:


 అమరావతి: ఫోన్ ట్యాపింగ్  కేసులో 16 మందికి  ఏపీ హైకోర్టు  శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. 

సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 
వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని హైకోర్టు ఆదేశించింది.

also read:ఫోన్ ట్యాపింగ్: కౌంటర్ దాఖలు‌కి ఏపీ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ విషయమై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు విచారణను ప్రారంభించింది.హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ జడ్జిలతో పాటు ప్రముఖుల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని హైకోర్టులో సోమవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఫోన్ ట్యాపింగ్ విషయమై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణను చేపట్టింది.ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ అధికారిని కూడ నియమించారని కూడ పిటిషనర్ పేర్కొన్నారు. 

 ఫోన్ ట్యాపింగ్ పై కచ్చితమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని హైకోర్టు పిటిషనర్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అడిషనల్ అఫిడవిట్ ను ఈ నెల 20వ తేదీన అడ్వకేట్ శ్రవణ్ కుమార్ దాఖలు చేశారు. మెయిన్ పిటిషన్ కు కలిపి పూర్తి స్థాయిలో పిటిషన్ వేయాలని హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ కు సూచించింది.
 

click me!