ఫోన్ చేసిన మూడు గంటల్లోనే కరోనా రోగులకు బెడ్స్ కేటాయించాలి: జగన్

Published : Apr 15, 2021, 05:01 PM IST
ఫోన్ చేసిన మూడు గంటల్లోనే కరోనా రోగులకు బెడ్స్ కేటాయించాలి:  జగన్

సారాంశం

ఫోన్ చేసిన మూడు గంటల్లోనే కరోనా రోగికి బెడ్స్ కేటాయించాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్  అధికారులను ఆదేశించారు.  

అమరావతి: ఫోన్ చేసిన మూడు గంటల్లోనే కరోనా రోగికి బెడ్స్ కేటాయించాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్  అధికారులను ఆదేశించారు.గురువారం నాడు  కరోనాపై  అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలన్నారు. 

హోంఐసోలేషన్ లో ఉన్నవారిని ఫాలో అప్ చేయాలని అధికారులకు సూచించారు.  రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కు అవసరమైన వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు గాను కేంద్రానికి  లేఖ రాయాలని ఆయన  అధికారులను కోరారు. 
ప్రస్తుతం అధికారులు ఏ స్పూర్తితో పనిచేస్తున్నారో అదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. 

రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.   గ్రీవెన్స్ కోసం 1902, కోవిడ్ సేవల కోసం 104 సేవల నెంబర్ కేటాయించాలని ఆయన సూచించారు. ఈ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.కరోనా రోగులకు చికిత్స అందిస్తే ఎంత ఫీజు వసూలు చేస్తారో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన పీజు కంటే ఒక్క రూపాయి ఎక్కువగా వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.మందులు, ఇంజక్షన్ల ధరలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu