రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు: జగన్‌పై చంద్రబాబు విమర్శలు

By Siva KodatiFirst Published Apr 15, 2021, 4:50 PM IST
Highlights

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. రూ.10 వేల కోట్లు అవినీతికి టార్గెట్లు పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. రూ.10 వేల కోట్లు అవినీతికి టార్గెట్లు పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

లిక్కర్ షాపుల్లో పాత బ్రాండ్లు పెట్టాలని ఆయన కోరారు. 60 రూపాయల క్వార్టర్ బాటిల్ రూ.200 కు అమ్మేస్తున్నారని చెప్పారు. దీనిపై అఖిలపక్ష సమావేశం పెట్టి వాస్తవాలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

పెంచిన పన్నులు, అప్పులు, ధరల వల్ల రాష్ట్రంలోని ఒక్కొక్క కుటుంబంపై రూ. 2.50 వేలు అదనపు భారం పడిందని ఆయన తెలిపారు. జగన్ ఇచ్చిందని గోరంత అయితే.. దోచింది కొండంతని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Also Read:తిరుపతిలో బీజేపీకి చావో రేవో: దుబ్బాక తరహలో ఫలితం సాధిస్తోందా?

రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఎక్కువ మోటార్లు వున్నాయని.. వాటికి మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని... 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి, మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయే పరిస్ధితి వచ్చిందని .. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్ధితి లేదని ఆయన ధ్వజమెత్తారు. టిడ్కో కింద నిర్మించిన 3 లక్షల ఇళ్లు రెడీగా వున్నాయని.. మొత్తం రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్‌లో రూ.30 వేలు కోట్లు కేంద్రం ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ లేదని, ఆరోగ్య సేవలు కూడా పేపర్‌కే పరిమితమయ్యాయని టీడీపీ చీఫ్ ఆరోపించారు. రాష్ట్రం మొత్తం అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తయారైందని కరోనా సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారంటూ మండిపడ్డారు. 

click me!