అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు, డీఎస్సీ ద్వారా నియామకాలు: జగన్

By Siva KodatiFirst Published Jul 4, 2019, 8:59 PM IST
Highlights

డీఎస్సీ ద్వారా గ్రామ సచివాలయంలో ఉద్యోగుల  నిమామకాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

డీఎస్సీ ద్వారా గ్రామ సచివాలయంలో ఉద్యోగుల  నిమామకాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రెండు వేలమందికి గ్రామ సచివాలయం ఉండాలని..  అత్యంత పారదర్శక విధానంలో, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వీటిని నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

గ్రామ సచివాలయాల్లో కల్పించే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం యువతకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. వివిధ అర్హతలున్న వారిని పరిగణనలోకి తీసుకుని వారంతా తమకు నిర్ణయించిన ఏ పనైనా చేయగలిగేలా తీర్దిదిద్దాలని జగన్ వెల్లడించారు.

మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని... అందుకోసం డ్రింకింగ్ వాటర్ కార్పోరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

రాబోయే ముప్పై ఏళ్లు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్పోరేషన్‌ ప్రణాళికలు రచించుకుని అమలు చేయాలని స్పష్టం చేశారు. 

click me!