భూసర్వేలో అవినీతి ఉండకూడదు: అధికారులకు జగన్ ఆదేశాలు

Siva Kodati |  
Published : Aug 12, 2021, 03:59 PM IST
భూసర్వేలో అవినీతి ఉండకూడదు: అధికారులకు జగన్ ఆదేశాలు

సారాంశం

‘శాశ్వత భూహక్కు–భూ రక్ష’పై ఇవాళ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం సమీక్ష నిర్వహించారు. సర్వే కోసం అవసరమైన సాఫ్ట్ వేర్, పరికరాలు, వనరులను వెంటనే సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. సర్వే చేసే సిబ్బందికి మెరుగైన శిక్షణను ఇవ్వాలని జగన్ ఆదేశించారు

ఎక్కడా అవినీతికి తావు లేకుండా లక్ష్యాన్ని చేరుకునేలా సమగ్ర భూ సర్వే సాగాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2023 జూన్ నాటికి సర్వేని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ‘శాశ్వత భూహక్కు–భూ రక్ష’పై ఇవాళ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సర్వే కోసం అవసరమైన సాఫ్ట్ వేర్, పరికరాలు, వనరులను వెంటనే సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు.

సర్వే చేసే సిబ్బందికి మెరుగైన శిక్షణను ఇవ్వాలని జగన్ ఆదేశించారు. నాలుగు వారాలకోసారి భూ సర్వేపై సమీక్ష చేస్తానని, ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లోనూ దీనిపై చర్చిస్తానని సీఎం స్పష్టం చేశారు. మంత్రుల కమిటీ కూడా వారానికోసారి సర్వే పురోగతిపై సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకుని ప్రతిష్ఠాత్మకంగా సర్వేని నిర్వహించాలని  జగన్ ఆదేశించారు. 
 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?