శ్రీవారి నగలు అమ్మేస్తారేమో.. మా వెంకన్నను వదిలేయండి: రఘురామ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 12, 2021, 2:46 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం విషయంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల నిధులపై వైసీపీ ప్రభుత్వం గురిపెట్టిందని ఆయన ఆరోపించారు. మా దేవుడిని వదిలేయమని వేడుకుంటున్నానంటూ రఘురామ అన్నారు

వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల నిధులపై వైసీపీ ప్రభుత్వం గురిపెట్టిందని ఆరోపించారు. వెంకన్ననూ వదలడం లేదని, ‘మా దేవుడిని వదిలేయమని వేడుకుంటున్నానంటూ రఘురామ అన్నారు. టీటీడీ నుంచి ప్రస్తుతం ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇక నుంచి ఏటా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. వెంకన్న నగలు కూడా అమ్మేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందని ఆరోపించారు. స్వామివారి ఆస్తులను ముట్టుకోవద్దంటూ భక్తులందరూ కలిసి సీఎంకు వినతిపత్రం పంపిద్దామని రఘురామ పిలుపు ఇచ్చారు.

ALso Read:ఏపీలో తిరోగమన పాలన, పరిశ్రమలన్నీ గుడ్‌బై.. హైదరాబాద్‌కు పెరుగుతున్న వలసలు: రఘురామ వ్యాఖ్యలు

ఇదే సమయంలో తాను ఎక్కడా షెడ్యూల్ 10ని ఉల్లంఘించలేదని ఎంపీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలను కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. న్యాయశాఖ మంత్రిని కలిసి ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని, చట్టానికి సవరణలు చేయాలంటూ వైసీపీ ఎంపీలు కోరారని రఘురామ గుర్తుచేశారు.
 

click me!