కోవిడ్, వ్యాక్సినేషన్‌పై జగన్ సమీక్ష: ఆనందయ్య మందుపై ఆరా

Siva Kodati |  
Published : May 28, 2021, 05:40 PM IST
కోవిడ్, వ్యాక్సినేషన్‌పై జగన్ సమీక్ష: ఆనందయ్య మందుపై ఆరా

సారాంశం

రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనాతో పాటు ఆనందయ్య మందు పంపిణీపైనా ఈ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రివ్యూలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆయుష్ కమీషనర్ రాములు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనాతో పాటు ఆనందయ్య మందు పంపిణీపైనా ఈ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రివ్యూలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆయుష్ కమీషనర్ రాములు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంటైన్మెంట్ విధానాన్ని జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దీనిపైనా జగన్ చర్చిస్తున్నారు. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో కర్ఫ్యూపై ప్రభుత్వం సారించింది. 

Also Read:మూలికలు, ద్రవ్యాలు లేవు.. ప్రభుత్వం చెప్పాల్సిందే: మందు తయారీ ఆపేశానన్న ఆనందయ్య

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,429 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,57,986కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,634కి చేరుకుంది.

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Speech Krupa Pranganam Re-Consecration Ceremony in Mangalagiri | Asianet News Telugu
Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu