పోలవరం ప్రాజెక్టుకు చెందిన పనులు 91 శాతం పూర్తయ్యాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ ఏడాది జూన్ 15 నాటికి మిగిలిన పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు చెందిన పనులు 91 శాతం పూర్తయ్యాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ ఏడాది జూన్ 15 నాటికి మిగిలిన పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తక్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి కేంద్రం నుండి రావాల్సిన పెండింగ్ నిధులను రాబట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రూ.1600 కోట్ల రూపాయల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని సీఎం చెప్పారు.వీటిని వెంటనే రాబట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు అని ఆయన గుర్తు చేశారు. . ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నామని సీఎం జగన్ చెప్పారు. వచ్చే మూడు నెలలకు కనీసం 1400 కోట్ల రూపాయలు ఖర్చు అని అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ వెళ్లి పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు.