ఏపీలో కాస్త తగ్గిన కేసులు: కలవరపెడుతున్న మరణాలు .. చిత్తూరు, ప.గోలలో భయానకం

Siva Kodati |  
Published : May 28, 2021, 05:18 PM IST
ఏపీలో కాస్త తగ్గిన కేసులు: కలవరపెడుతున్న మరణాలు .. చిత్తూరు, ప.గోలలో భయానకం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,429 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,57,986కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 14,429 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,57,986కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,634కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 7, ప్రకాశం 8, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, చిత్తూరు 15, గుంటూరు 7, కర్నూలు 4, నెల్లూరు 9, కృష్ణ 8, విశాఖపట్నం 10, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 15, ప్రకాశం 2, కడపలో నలుగురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 20,746 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 14,66,990కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 84,502 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,90,09,047కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,80,362 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1192, చిత్తూరు 2291, తూర్పుగోదావరి 2022, గుంటూరు 798, కడప 578, కృష్ణ 1092, కర్నూలు 1034, నెల్లూరు 930, ప్రకాశం 924, శ్రీకాకుళం 897, విశాఖపట్నం 1145, విజయనగరం 535, పశ్చిమ గోదావరిలలో 991 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Powerful Speech: తెలుగు గొప్పదనంపై చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపైUnion Minister Chandra Sekhar Pemmasani Speech | Asianet News Telugu