అనుకున్న నాటికే పోలవరం: అధికారులకు జగన్ కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Jan 29, 2021, 8:25 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం సీఎం సమీక్షించారు

పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం సీఎం సమీక్షించారు.

తొలివిడత ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. నిర్ణీత లక్ష్యంలోగా ప్రాజెక్టులు పూర్తవ్వాలని జగన్ సూచించారు. కాఫర్ డ్యాం వల్ల ముంపునకు గురికాకుండా చూడాలని.. సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.

నిర్ణీత ప్రణాళిక మేరకు ఆర్అండ్‌ఆర్‌ పనులను చేపట్టాలని జగన్ పేర్కొన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపైనా జగన్ సమీక్షించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి వంశధార-నాగావళి అనుసంధాన పనులు, జులై నాటికి వంశధార పెండింగ్‌ పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

వీటితో పాటు రెండో విడత ప్రాధాన్యతా ప్రాజెక్టుల కార్యాచరణ సిద్ధం చేయాలని.. అందులో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని జగన్ అధికారులను ఆదేశించారు.

రాయలసీమ, పల్నాడు ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలతో అంగీకారం కుదిరిందని.. మిగిలిన ప్రాజెక్టుల నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. 
 

click me!