చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో పాలనకు , తమ పాలనకు తేడాను గమనించాలని సీఎం జగన్ కోరారు. గొల్లప్రోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
పిఠాపురం: Chandrababu సీఎంగా ఉన్న కాలంలో ఇప్పటికీ జరిగిన మార్పును గమనించాలని ఏపీ సీఎం YS Jagan కోరారు.
గొల్లప్రోలులో YSR Kapu Nestham నేస్తం పథకం కింద లబ్దిదారులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. ప్రతి ఏటా రూ. 15 వేలను కాపు సామాజిక వర్గానికి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
గతంలో అధికార పార్టీ నేతలు చెప్పినవారికే సంక్షేమ పథకాలు అందేవన్నారు. కానీ తమ ప్రభుత్వం కులం, మతం, పార్టీ, ప్రాంతం అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జగన్ గుర్తుచేశారు. Chandrababu సీఎంగా ఉన్న సమయంలో దోచుకో, పంచుకో,తినుకో అనే పథకాలు సాగేవని ఆయన ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పద్దతిలో నేరుగా లబ్దిదారులకే సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తుందని సీఎం జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న డీబీటీ పథకం కావాలో, డీపీటీ కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
వందల సామాజిక వర్గాలు బాగు పడాలా, చంద్రబాబు, దుష్టచతుష్టయంతో పాటు దత్తపుత్రుడు బాగుపడే పాలన కావాలో ఆలోచించుకోవాలని జగన్ ప్రజలను కోరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేసినట్టుగా జగన్ గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నికల మేనిఫెస్టో ను అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తబుట్టకు పరిమితం చేశాడన్నారు.
సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేయాలని టీడీపీ అంటోందని సీఎం విమర్శించారు. దత్తపుత్రుడు రాజకీయాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని సీఎం పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు చేశారు. చంద్రబాబు మాదిరిగా తనకు దత్తపుత్రుడు, దుష్టచతుష్టయం అండగా లేకపోయినా ప్రజల ఆశీర్వాదాలు, దేవుడి దీవెనలున్నాయన్నారు. చంద్రబాబు ఉన్న సమయంలో ఇదే బడ్జెట్, ఇవే అప్పులున్నాయన్నారు. సీఎం మాత్రమే మారినట్టుగా జగన్ గుర్తు చేశారు.
హుదూద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు బాధితులకు రూ. 4 వేలుఇచ్చినట్టుగా ప్రచారం చేసుకొంటున్నారన్నారు. కానీ గోదావరి వరద ముంపు బాధితులకు రూ. 2 వేల ఆర్ధిక సహయం చేశామన్నారు. రేషన్ సరుకులను ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో తాను ఉత్తరాంధ్రలో పాదయాత్ర నిర్వహించినట్టుగా ప్రస్తావించారు. కానీ ఆ సమయంలో పాడైన ఆహార, పదార్ధాలతో పాటు అక్కడక్కడ బియ్యం పంపిణీ చేశారని జగన్ విమర్శించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా కూనడా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద లబ్దిదారులకు నిధులను అందిస్తున్నామన్నారు. కాపు నేస్తం పథకం కింద అర్హులైన 3,38,792 మందికి రూ. 508.18 కోట్లు లబ్ది జరిగిందని సీఎం జగన్ చెప్పారు.
మూడేళ్లలో ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ. 45 వేలు అందించినట్టుగా చెప్పారు. ఈ పథకం కింద ఈ ఏటా 3 లక్షల 38 వేల 792 మంది కాపు మహిళలకు లబ్ది చేకూరనుందని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబునాయుడు కాపులకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయిస్తానని చెప్పి హామీ ఇచ్చి అమలు చేయలేదని సీఎం జగన్ విమర్శించారు. కాపులకు మాటలతోనే కాదు చేత ద్వారా కాపు కాస్తామని నిరూపించామన్నారు.నాన్ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో 16 వేల కోట్ల లబ్ది పొందనున్నారని సీఎం జగన్ చెప్పారు.
తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదా ఎమ్మెల్యేలు గడప గడపకు వచ్చి తెలుసుకొంటున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్న విషయాన్ని జగన్ చెప్పారు.