తిరుపతిని సర్వనాశనం చేశారు.. మూడేళ్ల పాలనలో జరగని పాపం లేదు..నిర్మాత అశ్వినీదత్ మండిపాటు..

By Bukka SumabalaFirst Published Jul 29, 2022, 9:03 AM IST
Highlights

తిరుపతిని సర్వనాశనం చేశారంటూ సినీ నిర్మాత అశ్వినీ దత్ విరుచుకుపడ్డారు. జగన్ మూడేళ్ల పాలనలో అక్కడ జరగని అన్యాయం లేదంటూ విమర్శించారు. 

హైదరాబాద్ : ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తిరుపతిని సర్వ నాశనం చేసిందని సినీ నిర్మాత అశ్వినీదత్ విమర్శించారు. ఇప్పుడు అక్కడ జరగని పాపం లేదు అని..  అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేము అని వ్యాఖ్యానించారు. ‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘chandrababu మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం ఉంది.  వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చిన్న జీయర్ స్వామి ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఆగమశాస్త్రం ప్రకారమే చంద్రబాబు ఆ మండపాన్ని తొలగించారని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి..  ఈ మూడేళ్ల కాలంలో తిరుపతి సర్వనాశనం చేసింది.

ఆ వెంకటేశ్వరస్వామి ఇంకా ఈ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో బలవంతపు మతమార్పిడులు జరుగుతుంటే చిన్న జీయర్ స్వామి ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన ఆ మధ్య ఓ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా జగన్ను దైవాంశ సంభూతునిగా పొగిడాడు. ఆ మాటలు వినగానే నాకు కడుపు మండిపోయింది. సమ్మక్క -సారక్క అంటే ప్రజల్లో ఎంతో విశ్వాసం. పొరుగు రాష్ట్రాల ప్రజలూ సమ్మక్క సారక్క దేవతలుగా నమ్ముతారు. వారిని ఆయన దేవతలు కాదనడం బాధ కలిగించింది అని Ashwini dutt చెప్పారు. 

అంత తీరిక లేకుండా పనిచేస్తున్నారా? గాంధీ, తిలక్ కంటే గొప్పవారా?.. జవహర్ రెడ్డిపై హైకోర్టు సీరియస్...

click me!