పేదల తలరాతలు మార్చేందుకే: జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధుల విడుదల

Published : Nov 30, 2021, 02:36 PM ISTUpdated : Nov 30, 2021, 03:02 PM IST
పేదల తలరాతలు మార్చేందుకే: జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధుల విడుదల

సారాంశం

జగనన్న విద్యా దీవెన పథకం కింద మూడో విడత నిఃధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు విడుదల చేశారు. పేద విద్యార్ధులు విద్యకు దూరం కాకూడదనే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.   

అమరావతి: పేద విద్యార్ధుల కోసమే  పూర్తి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. jagananna vidya deevena పథకం కింద మూడో విడత నిధులను ఏపీ సీఎం YS Jagan మంగళవారం నాడు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. పేద విద్యార్దుల చదువులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. 

మూడో విడతగా రాష్ట్రంలోని 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ.686 కోట్ల నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేశారు. పేద విద్యార్ధులు పెద్ద చదువులు చదివితేనే వారి తల రాతలు మారుతాయని  సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.ప్రతి ఒక్క విద్యార్ధిని వంద శాతం గ్రాడ్యుయేట్లుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. మొదటి విడత కింద  ఈ ఏడాది ఏప్రిల్ 19న, రెండో విడత కింద ఈ ఏడాది జూలై 29న మూడో విడత కింద నిధులను పంపిణీ చేశారు. మూడో విడత కింద ఇవాళ నిధులను విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో నాలుగో విడత నిధులను ఇవ్వనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ఉన్నకాలంలో పీజు రీ ఎంబర్స్ మెంట్  పథకాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చాని ఆయన గుర్తు చేశారు.కాలేజీలకు ఏళ్లతరబడి బకాయిలను పెండింగ్ లో పెట్టారన్నారు. దీంతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య విషయంలో కాలేజీలను  అడిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.   విద్యార్ధులకు కాలేజీకి రావొద్దని, పరీక్షలు రాయనివ్వమని అన్న ఘటనలు కూడా  జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంలో  నెల్లూరు జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాకూడదనే అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకేసినట్టుగా చెప్పారు. 

also read జగనన్న విద్యా దీవెన : నేడే మూడో విడత నిధుల పంపిణీ.
ఒక్క కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా కూనడా వారికి పూర్తిగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అందిస్తున్నామన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌.. ఈకోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక్క కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా కూనడా వారికి పూర్తిగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అందిస్తున్నామన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనల ద్వారా చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం జగన్. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వే రిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థల జీఈఆర్‌ రేష్యో 2020 నాటికి 35.2 శాతానికి పెరిగిందని చెప్పారు. 2018 –19 తో పోలిస్తే.. 2019–20 మధ్య పెరుగుదల దేశవ్యాప్తంగా 3.04 అయితే, మన రాష్ట్రంలో 8.6శాతంగా నమోదైందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్