వరదలతో నష్టపోయాం.. ఏపీకి తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి

Published : Nov 30, 2021, 01:43 PM IST
వరదలతో నష్టపోయాం.. ఏపీకి తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy rains) రాయలసీయ, దక్షిణ కోస్తా జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. ఏపీని ఆదుకోవడానికి కేంద్రం  తక్షణ సాయం కింద వేయి కోట్లు ఇవ్వాలని rajya sabhaలో విజ్ఞప్తి  చేశారు.   

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (Heavy rains) రాయలసీయ, దక్షిణ కోస్తా జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. మంగళవారం రాజ్యసభ (rajya sabha) జీరో అవర్‌లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో వరదల అంశాన్ని ప్రస్తావించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులైనారని తెలిపారు. కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయని, చాలా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. కోతకు వచ్చిన పంట వరదల్లో మునిగిపోయిందన్నారు. వరదల వల్ల 44 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 16 మంది ఆచూకీ దొరకలేదని చెప్పారు. ప్రాథమికంగా రూ. 6,054 కోట్ల నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేశారని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. ఏపీని ఆదుకోవడానికి కేంద్రం  తక్షణ సాయం కింద వేయి కోట్లు ఇవ్వాలని rajya sabhaలో విజ్ఞప్తి  చేశారు. 

‘నవంబర్‌ 16 నుంచి 18 తేదీల మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొన్ని చోట్ల ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి.  రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు, విద్యుత్‌ లైన్లు, స్తంభాలు వరదలో కొట్టుకుపోయాయి. వరదలు ముంచెత్తడంతో కొన్ని జలాశయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధమైన పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు ధ్వంసమైపోయాయి. రూ. 654 కోట్ల విలువ చేసే పంటలు దెబ్బతిన్నాయి.

Also read: జగనన్న విద్యా దీవెన : నేడే మూడో విడత నిధుల పంపిణీ..

ప్రాధమిక అంచనాల ప్రకారం 6,054 కోట్ల రూపాయల పంట, ఆస్తి నష్టం జరిగింది. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టింది. వరదలతో అతలాకుతలమైపోయిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను ప్రారంభించింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం అర్ధిస్తోంది. ఈ విప్తతు నుంచి కోలుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించాలని కేంద్రాన్ని, ఆర్థిక శాఖ మంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని విజయసాయిరెడ్డి రాజ్యసభలో తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్