గోదావరికి పోటెత్తిన వరద: ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు సీఎం ఫోన్

By narsimha lodeFirst Published Aug 17, 2020, 4:25 PM IST
Highlights

గోదావరికి వరద పోటెత్తడంతో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు.


అమరావతి: గోదావరికి వరద పోటెత్తడంతో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ త్ో సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం ఫోన్ లో మాట్లాడారు. జిల్లాలోని  13 మండలాల్లో ముంపు ప్రమాదం ఉందని కలెక్టర్ సీఎంకు వివరించారు.  ముంపు బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా అధికారులు సీఎంకు చెప్పారు.

also read:గోదావరికి పోటెత్తిన వరద: భద్రాచలం వద్ద 61 అడుగులు, నీట మునిగిన గ్రామాలు

మరో వైపు పశ్చిమ  గోదావరి జిల్లా కలెక్టర్ తో కూడ సీఎం జగన్ మాట్లాడారు.  జిల్లాలోని 7 మండలాలకు వరద ముంపు ఉందని కలెక్టర్ తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని జగన్ కు కలెక్టర్లు చెప్పారు.గోదావరికి సుమారు 19 లక్షల క్యూసెక్కుల వరద నీరు దవళేశ్వరం నుండి సముద్రంలోకి కలుస్తోంది.పోలవరం గ్రామం వద్ద కట్ట బలహీనపడి నీరు గ్రామంలోకి వస్తోంది. దీంతో కట్టను బలోపేతం చేసేందుకు ఇసుకబస్తాలను వేశారు.
 

click me!