వైఎస్సార్ జయంతి .. ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డికి వైఎస్ జగన్, విజయమ్మ నివాళులు

By Siva KodatiFirst Published Jul 8, 2023, 4:42 PM IST
Highlights

తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌కు నివాళులర్పించిన జగన్.. అనంతరం ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. 

అంతకుముందు ఉదయం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు తెలంగాణలోని  పాలేరులో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకల్లో షర్మిల పాల్గొననున్నారు.

ALso Read: వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాలయలో వైఎస్ షర్మిల, విజయమ్మ నివాళులు..

ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఒకరికొకరు ఎదురు పడకుండా.. ఎవరికివారే వేర్వేరు సమయాల్లో నివాళులర్పించేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  
 

click me!