18 ఏళ్లు దాటినవారికి కరోనా టీకాపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 29, 2021, 5:34 PM IST
Highlights

రాష్ట్రంలో కోవిడ్ పరిస్ధితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు ఇప్పుడు వ్యాక్సినేషనే పరిష్కారంగా వుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు

రాష్ట్రంలో కోవిడ్ పరిస్ధితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు ఇప్పుడు వ్యాక్సినేషనే పరిష్కారంగా వుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

18-45 సంవత్సరాల వయసు వారికి సెప్టెంబర్ నుంచి టీకా ఇవ్వొచ్చని ఆయన అంచనా వేశారు. వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి 4 నెలల సమయం పడుతుందని సీఎం అన్నారు. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి నాటికి 18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.

కాబట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్ధితి వుంటుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రజలంతా జాగ్రత్తగా వుండాల్సిందేనని సీఎం అన్నారు. శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.

Also Read:కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలివే..: కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్ పర్సన్ కీలక ఆదేశాలు

కాగా, దేశంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందిరికీ వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హులైన వారందరూ తమ పేర్లను కోవిన్ వెబ్‌సైట్, ఆరోగ్య సేతు యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు.

18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్ ఖరారవుతుంది. 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకా కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎలాంటి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ వుండబోదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

అలాగే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే టీకాలను 45 ఏళ్లు లోపు వారికి వినియోగించకూడదని స్పష్టం చేసింది. అవి కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందించాలని సూచించింది. రాష్ట్రాలు ప్రైవేట్ వ్యాక్సిన్లు కొనుగోలు చేసిన వ్యాక్సిన్లు మాత్రమే 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి పంపిణీ చేయాలని తెలిపింది. 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!