గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు.. ఆర్టీసీ బస్సులో దొరికిన రెమ్‌డిసివర్ ఇంజెక్షన్లు

By Siva KodatiFirst Published Apr 29, 2021, 4:51 PM IST
Highlights

కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమ్‌డిసివర్ ఇంజెక్షన్లకు ప్రస్తుతం ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. దీంతో కొందరు అక్రమార్కులు ఈ ఔషదాన్ని నల్ల బజారుకు తరలించి భారీగా లాభాలు పొందుతున్నారు.

కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమ్‌డిసివర్ ఇంజెక్షన్లకు ప్రస్తుతం ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. దీంతో కొందరు అక్రమార్కులు ఈ ఔషదాన్ని నల్ల బజారుకు తరలించి భారీగా లాభాలు పొందుతున్నారు. కొన్ని చోట్ల రెమ్‌డిసివర్‌ను అక్రమంగా తరలిస్తున్నారు.

తాజాగా కృష్ణాజిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌లను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అజయ్‌కుమార్ అనే వ్యక్తి దగ్గర ఉన్న 100 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడులో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న భూషయ్య నర్సింగ్ హోంకు ఈ ఇంజెక్షన్లు తరలిస్తున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్‌‌లోని ల్యాండ్‌మార్క్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న భవ్య అనే మహిళ ఇంజెక్షన్‌లను పంపినట్లు పోలీసుల దర్యాప్తలో తేలింది. ఈ ఘటనలో అజయ్‌కుమార్, గరికపాటి సుబ్బారావు, భవ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!