సుదీర్ఘ చర్చలు, వడపోతలు, తర్జన భర్జనల అనంతరం వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితాకు జగన్ ఆమోదముద్ర వేశారు. 27 మందితో కూడిన సెకండ్ లిస్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం విడుదల చేశారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రక్షాళన మొదలుపెట్టారు. గెలవరు అని తేలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నో చెబుతున్నారు. లేదంటే మరో చోటికి పంపుతున్నారు. సుదీర్ఘ చర్చలు, వడపోతలు, తర్జన భర్జనల అనంతరం వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితాకు జగన్ ఆమోదముద్ర వేశారు. 27 మందితో కూడిన సెకండ్ లిస్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం విడుదల చేశారు.