వాళ్లకు ఆ తేడా తెలియదు: సొంత పత్రికపైన జగన్ విమర్శలు

By sivanagaprasad KodatiFirst Published Dec 10, 2019, 4:10 PM IST
Highlights

 నాణ్యమైన బియ్యానికి, సన్న బియ్యానికి తేడా తెలియకుండా సాక్షి పేపర్‌లో తప్పుగా రాశారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్వర్ణ రకాన్నే సన్నబియ్యం అంటారని వెల్లడించారు

సాక్షి మీడియా, సాక్షి పత్రిక వైఎస్ జగన్ కుటుంబానిదే అని అందరికి తెలిసిందే. అది జగన్ అవినీతి పుత్రిక అంటూ ప్రతిపక్షాలు ప్రతినిత్యం మండిపడుతూనే ఉన్నాయి. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సహా వైఎస్సార్‌సీపీ నేతలంతా ధీటుగా బదులిస్తూనే ఉంటారు.

అయితే స్వయంగా జగన్ తన పత్రిక వైఖరిని అసెంబ్లీ సాక్షిగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం సన్నబియ్యం అంశంపై పెద్ద చర్చ జరిగింది.

Also Read:చంద్రబాబుపై రోశయ్య డైలాగ్ వదిలిన బుగ్గన: నాకు తెలివి ఉంటే కత్తి తీసుకుని...

దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో సన్న బియ్యం అనే పేరే లేదన్నారు. ముందుగా బియ్యం గురించి తెలుసుకుని నాలెట్జ్ పెంచుకోవాలంటూ ప్రతిపక్ష సభ్యులకు జగన్ చురకలంటించారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో‌ను సీఎం అసెంబ్లీలో చదివి వినిపించారు. మేనిఫెస్టో భగవద్గీత అని చెప్పి రిలీజ్ చేశామన్న జగన్ ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో నాణ్యమైన బియ్యానికి, సన్న బియ్యానికి తేడా తెలియకుండా సాక్షి పేపర్‌లో తప్పుగా రాశారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్వర్ణ రకాన్నే సన్నబియ్యం అంటారని వెల్లడించారు.

రేషన్ బియ్యాన్ని ప్రజలు తీసుకోవడం లేదని నాణ్యమైన బియ్యాన్ని ఇస్తున్నామని.. తాము ఇచ్చే బియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. నాణ్యమైన బియ్యం కోసం రూ.1,400 కోట్లు అదనంగా ఖర్చు చేస్తామని, ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం అందిస్తామని జగన్ స్పష్టం చేశారు.

Also Read:హెరిటేజ్ నాది కాదు, నిరూపిస్తే రాజీనామా: జగన్‌కు బాబు సవాల్

స్వర్ణ లాంటి రకాల ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తామని... నాణ్యమైన బియ్యం ఇస్తుంటే అసూయతో టీడీపీ విమర్శలు చేస్తోందని సీఎం మండిపడ్డారు. ముందు టీడీపీ నేతలను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తేనే వాళ్లు బాగుపడతారని జగన్ మండిపడ్డారు.
 

click me!