జగన్! ముందుంది ముసళ్లపండగ, మీ కథ చూస్తాం: చంద్రబాబు ఫైర్

Published : Dec 10, 2019, 03:55 PM IST
జగన్! ముందుంది ముసళ్లపండగ, మీ కథ చూస్తాం: చంద్రబాబు ఫైర్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీలో రైతు భరోసా పథకంపై చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు ఎన్నిసార్లు చెప్పినా వినడని ఆయన ఎప్పుడూ కుక్కతోక వంకరే అన్నట్లుగా వ్యవహరిస్తారంటూ విరుచుకుపడ్డారు.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీలో రైతు భరోసా పథకంపై చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు ఎన్నిసార్లు చెప్పినా వినడని ఆయన ఎప్పుడూ కుక్కతోక వంకరే అన్నట్లుగా వ్యవహరిస్తారంటూ విరుచుకుపడ్డారు. 

జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సైతం ఘాటుగానే సెటైర్లు వేశారు. కుక్కతోక ఎవరు వంకరో అన్నది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. కుక్కతోక అంటే జగన్ ని నమ్మి ప్రజలంతా ఓట్లేశారని ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. 

జగన్ ను నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని స్పష్టం చేశారు. జగన్ ను నమ్ముకుని మోసపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదుదామనుకున్నామని అయితే మధ్యలో మునిగిపోయామని ఆర్నెళ్లలోనే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఏం పర్లేదు జగన్మోహన్ రెడ్డి ముందు ఉంది మీకు మెుసళ్లపండగ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా చాలా టైము ఉందని తెలుస్తుందన్నారు. మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని చేతలు మాత్రం గడపదాటడం లేదంటూ సెటైర్లు వేశారు చంద్రబాబు. 

అది నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్

అప్పుడే అయిపోలేదని ఏడు నెలల్లోనే సంబరం అయిపోలేదని మీ కథలు చాలా చూస్తామంటూ జగన్ పై వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పారంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 

రైతు భరోసా విషయంలో రైతులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. వ్యవసాయానికి బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారో ఆ రుణాలను మాఫీ చేశామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాము ఆ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని నిరూపించామని చెప్పుకొచ్చారు. 

వైసీపీ ప్రభుత్వం మాదిరిగా తాను అసత్యాలు మాట్లాడనని చెప్పుకొచ్చారు. తాను ఏనాడు వ్యవసాయం శుద్ధ దండగా అనలేదన్నారు. అదే అంశంపై తాను నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరానని చెప్పుకొచ్చారు. 

తాను వ్యవసాయం శుద్ధ దండగా అన్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరానని కానీ రాజశేఖర్ రెడ్డి తప్పించుకున్నాడని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించిన ఘనత తమకే చెల్లుతుందని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. 

ధాన్యం కొనుగోలు ఇంకా ప్రారంభించలేదని అప్పుడే ఏదో జరిగిపోయిందని అంటే ఎలా అని నిలదీశారు కన్నబాబు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదని చంద్రబాబు ఆరోపించారు. 


చంద్రబాబుపై రోశయ్య డైలాగ్ వదిలిన బుగ్గన: నాకు తెలివి ఉంటే కత్తి తీసుకుని

PREV
click me!

Recommended Stories

Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu
రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy | Asianet News Telugu