జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన మంత్రి అవంతి శ్రీనివాస్: గట్టిగా చెప్పిన సీఎం

By Nagaraju penumala  |  First Published Nov 27, 2019, 6:56 PM IST

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మద్యపాన నిషేధంపై జగన్ చర్చించారు. మద్యాన్ని నిషేధించడం వల్ల టూరిజానికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజం కోసమే తాము మద్యం ధరలు పెంచుతున్నట్లు తెలిపారు జగన్. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మద్యపాన నిషేధంపై జగన్ చర్చించారు. మద్యాన్ని నిషేధించడం వల్ల టూరిజానికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. 

Latest Videos

అవంతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. టూరిజం కోసం ఆలోచించ వద్దని సమాజం కోసం ఆలోచించాలని సూచించారు. మద్యపాన నిషేధం వల్ల సామాన్యుడు బాగుపడాలన్నదే తమ లక్ష్యమన్నారు సీఎం జగన్. 

ఇకపోతే మద్యం ధరలు పెరిగిపోయాయంటూ కొందరు మంత్రులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మద్యం ధరలు పెరగడం మంచిదేనన్నారు. పేదవాడికి మద్యం అందకూడదని అలాగే మద్యం ప్యాకేట్లు సరఫరాను కూడా తగ్గించాలని సీఎం జగన్ సూచించారు. 

వైఎస్సార్ వాహనమిత్ర రూ.400 కోట్లు...రెండో విడత పంపిణీ చేపట్టిన పేర్ని నాని

ఇకపోతే తమ అభిప్రాయాలు చెప్పాలని మహిళా మంత్రులను అడిగారు సీఎం జగన్. మద్యపాన నిషేధం చేయాలా వద్దా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేయాల్సిందేనని మహిళా మంత్రులు స్పష్టం చేశారు.   

మరోవైపు అవినీతి నివారణ చర్యలు, పారదర్శకతపై సమావేశంలో ప్రస్తావించారు సీఎం జగన్. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని తేల్చి చెప్పారు. జూనియర్ లైన్ మెన్ల నియామకంలో మంత్రులు లేదా ఇంఛార్జ్ మంత్రులుకైనా బాధ్యతలు అప్పగించాలని కోరారు.

అందుకు జగన్ ససేమిరా అన్నారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే అన్ని రకాల నియామకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఇకపోతే నియామకాలలో పార్టీల గురించి ఆలోచనే చేయోద్దని సూచించారు. మీరు ఇలా కట్టడి చేస్తే కేడర్ కు సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు మంత్రులు జగన్ ఎదుట వాపోయారు. పాదయాత్ర చేసి ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే అధికారులు ఎంజాయ్ చేస్తున్నారంటూ పలువురు మంత్రులు సూచించారు. 

టాయిలెట్లు లేని సెక్రటేరియట్... నారాయణ కాలేజీల్లా బిల్డింగులు: అమరావతిపై పేర్ని నాని కామెంట్స్

తాము సీఎంకు భయపడుతున్నామని కానీ అధికారులు మాత్రం తమకు భయపడటం లేదని మంత్రులు వాపోయారు. అధికారులను ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసునని మీరేమీ కంగారు పడొద్దన్నారు. 

అధికారులు తప్పులు చేస్తే మంత్రులు సైతం కంట్రోల్లో పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జగన్ తెలిపారు. ఇప్పటి నుంచే క్యాడర్ ను సమాయత్తం చేయాలని జగన్ ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలిపారు.  

ఢిల్లీ కేంద్రంగా వైసీపీలో కుదుపు: ఆ ఎంపీ వల్ల జగన్ కు టెన్షన్

click me!