కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో ఏపీ సీఎం జగన్ భేటీ: ప్రాజెక్టుల అనుమతులకై వినతి

By narsimha lode  |  First Published Dec 28, 2022, 3:35 PM IST

రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులకు  అనుమతుల విషయమై  కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రితో  ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు భేటీ అయ్యారు.  రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల అనుమతుల విషయమై చర్చించారు.


న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి  భూపేంద్ర యాదవ్ తో  ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు  40 నిమిషాల పాటు భేటీ అయ్యారు.   రాష్ట్రంలో  నిర్మిస్తున్న  ప్రాజెక్టులకు సంబంధించి  అనుమతుల విషయమై  కేంద్ర మంత్రితో ఏపీ సీఎం వైఎస్ జగన్  చర్చించారు.

రాష్ట్రంలో  నిర్మిస్తున్న  ప్రాజెక్టులు , భవిస్యత్తులో  నిర్మించనున్న ప్రాజెక్టులకు గురించి  అనుమతుల విషయమై సీఎం జగన్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో చర్చించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  భేటీ కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్  నిన్న  సాయంత్రం అమరావతి నుండి  బయలుదేరారు. నిన్న రాత్రి 10 గంటలకు  సీఎం జగన్  న్యూఢిల్లీకి చేరారు. ఇవాళ మధ్యాహ్నం  12:30 గంటలకు  ఏపీ సీఎం  వైఎస్ జగన్   ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. సుమారు  45 నిమిషాల పాటు  ప్రధానితో  సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి  నిధుల విషయంతో పాటు  పోలవరం ప్రాజెక్టుకు  నిధులు ఇతరత్రా అంశాలపై చర్చించారు.  ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత  సీఎం జగన్  నేరుగా  కేంద్ర పర్యావరణ అటవీ శాఖమంత్రితో భేటీ అయ్యారు.ఇవాళ రాత్రి  10 గంటలకు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  ఏపీ సీఎం వైఎస్ జగన్  సమావేశంకానున్నారు. రాష్ట్రానికి చెందిన  సమస్యలపై చర్చించనున్నారు.
 

Latest Videos

click me!