ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారరు. రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Employees బదిలీలకు ఏపీ సీఎం YS Jagan గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఉద్యోగుల బదిలీల పైల్ పై సీఎం జగన్ సోమవారం నాడు సంతకం చేశారు.ఈ నెల 17వ తేదీ లోపుగా ఉద్యోగుల Transfers సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇవాళ లేదా రేపు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను బదిలీ చేసేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు. బదిలీల ప్రక్రియను కూడా ఈ నెల 17వ తేదీలోపుగా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా రాస్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు.
2021 డిసెంబర్ మాసంలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.ఉద్యోగ సంఘాల వినతి మేరకు ఆ సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీలు కొరుకొనే ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్ కేసులు ంటే పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వని విషయం తెలిసిందే.