ఎన్నికలు ఎంతో దూరం లేవు.. సిద్ధంకండి : ఆలూరు కార్యకర్తలకు జగన్ పిలుపు

Siva Kodati |  
Published : Oct 13, 2022, 07:52 PM IST
ఎన్నికలు ఎంతో దూరం లేవు.. సిద్ధంకండి : ఆలూరు కార్యకర్తలకు జగన్ పిలుపు

సారాంశం

ఎన్నికలకు ఎంతో సమయం లేదని సిద్దంగా వుండాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆలూరు వైసీపీ కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వంలో వున్న మనం.. గ్రామ స్థాయిల్లో కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నామని జగన్ అన్నారు. 

కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయని.. ఈరోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సాధిస్తామని.. దీనిలో భాగంగా గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నామని జగన్ తెలిపారు. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారని... గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్తున్నారని సీఎం చెప్పారు. ప్రభుత్వంలో వున్న మనం.. గ్రామ స్థాయిల్లో కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నామని జగన్ అన్నారు. 

ఇకపోతే... గత నెలలో గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో 27 మందికి క్లాస్ పీకారు వైఎస్ జగన్. కొందరు మంత్రులు , ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన ఆయన ఐదుగురు రీజనల్ కో ఆర్డినేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని లేదంటే పదవులకు రాజీనామా చేసి తప్పుకోవాలని తేల్చిచెప్పారు జగన్. అక్టోబర్ 15 నుంచి ప్రతీ ఎమ్మెల్యేకు ఒక ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేస్తానని సీఎం పేర్కొన్నారు. అటు జగన్ క్లాస్ తీసుకున్న వారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత, రోజా , కారుమూరి నాగేశ్వరరావులు వున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని, కొడాలి నానికి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రంథి శ్రీనివాస్, శిల్పా చక్రపాణి, చిర్ల జగ్గిరెడ్డి, కోడుమూరి శ్రీనివాసులు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంకా యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. సీఎం క్లాస్ తీసుకున్న వారిలో మంత్రులు , మాజీ మంత్రులే ఎక్కువగా వున్నారు. 

ALso Read:ఇకపై ప్రతి ఎమ్మెల్యేకూ ఒక ఐప్యాక్ ప్రతినిధి.. వారసులకు నో టికెట్స్ : తేల్చేసిన జగన్

అసెంబ్లీ ఎన్నికలకు 19 నెలల సమయం వుందని పదేపదే గుర్తుచేశారు జగన్. మీరంతా నాతో పాటు నా చేయి పట్టుకుని నడిచినవారేనని జగన్ పేర్కొన్నారు. పనితీరు మెరుగు పర్చుకోవాలని సీఎం ఆదేశించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్ధుల మార్పు వుంటుందని జగన్ వెల్లడించారు. పనితీరు బాగోని నేతలను మారుస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. వారసులకు టికెట్లు ఇచ్చే అంశంపై జగన్ స్పందించారు. 

వచ్చే ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని వారసులకు టికెట్లు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మళ్లీ మీ ఇద్దరూ తనతో కలిసి పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్లాలని జగన్ వారిద్దరికి సూచించారు. గంట, రెండు గంటలు గ్రామాల్లో తిరిగితే లాభం లేదని సీఎం పేర్కొన్నారు. 7 నుంచి 8 గంటలు గ్రామాల్లో తిరగాలని జగన్ ఆదేశించారు. మళ్లీ డిసెంబర్‌లో సమీక్ష నిర్వహిస్తానని సీఎం పేర్కొన్నారు. అప్పటికీ అందరూ బాగా పనిచేయాలని... మళ్లీ పేర్లు చదవాల్సిన అవసరం రాకూడదని సీఎం వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని జగన్ వ్యాఖ్యానించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం