ఎంఎల్‌హెచ్ పీ పోస్టుల భర్తీ: స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు

By narsimha lode  |  First Published Oct 13, 2022, 5:06 PM IST

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఎంఎల్‌హెరచ్ పీ  పోస్టుల  భర్తీపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ స్టే విధించింది.  
 


అమరావతి: రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ సూపర్ వైజర్ (ఎంఎల్‌హెచ్‌పీ) భర్తీ ప్రక్రియపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచీ స్టే విధిస్తూ గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య క్లినిక్ లు , ఆరోగ్య వెల్ నెస్ కేంద్రాల్లో 1681 నియామకం కోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్  జారీచేసింది.ఈ మేరకు ఈ ఏడాది ఆగష్టు 9న నోటీఫికేషన్  ఇచ్చింది. నిబంధనలకు విరుద్దంగా ఎంఎల్‌హెచ్‌పీ పోస్టలు నియామకం చేపట్టారని శివకృష్ణ దాఖలుచేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ నిర్వహించింది. 

Latest Videos

undefined

also read:అర్హత ఉన్న ఆయుష్ డాక్టర్లకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు: జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు ఝలక్

ఎంఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీఎస్సీ నర్సింగ్ ను విద్యార్హతగా ప్రకటించిందని పిటిషనర్ న్యాయవాది  కోర్టుకు తెలిపారు.  కానీ ఇతర  రాష్ట్రాల్లో మాత్రం  ఆయుష్ డాక్టర్లకు అవకాశం కల్పించారని  పిటిషనర్ ప్రకటించారు. జాతీయ ఆరోగ్య విధానం -2017  విధానాలకు విరుద్దంగా  ప్రభుత్వం రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించిందని కూడ పిటిషనర్  తరపు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత  ఎంఎల్ హెచ్ పీ పోస్టుల భర్తీపై  ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్  స్టే విధించింది. 

click me!