రేపు ఢిల్లీకి జగన్: అమిత్‌షాత్ పాటు పలువురు మంత్రులతో భేటీ

Published : Sep 21, 2020, 08:37 PM IST
రేపు ఢిల్లీకి జగన్: అమిత్‌షాత్ పాటు పలువురు మంత్రులతో భేటీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.  


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.

ఈ నెల 22వ తేదీ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలో ఉండనున్నారని తెలుస్తోంది.

ఢిల్లీ నుండి నేరుగా సీఎం జగన్  తిరుమలకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకొంది.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర ప్రాజెక్టుల విషయమై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇవాళే ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని మంత్రి అనిల్ కుమార్ ను కోరిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: ఫోన్లోనే అధికారులకి చెమటలు పట్టించిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet
Ayyanna Patrudu Speech: అయ్యన్న పాత్రుడు స్పీచ్ కి సభ మొత్తం నవ్వులే నవ్వులు| Asianet News Telugu