హిందూ దేవాలయాలపై ఆగని దాడులు...ఈసారి కాలభైరవ విగ్రహం ధ్వంసం

Published : Sep 21, 2020, 08:14 PM ISTUpdated : Sep 21, 2020, 08:24 PM IST
హిందూ దేవాలయాలపై ఆగని దాడులు...ఈసారి కాలభైరవ విగ్రహం ధ్వంసం

సారాంశం

అంతర్వేది ఘటన మొదలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిరోజూ ఏదో ఒకచోట హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతూనే వున్నాయి.

ఆళ్లగడ్డ: అంతర్వేది ఘటన మొదలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిరోజూ ఏదో ఒకచోట హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులోని శ్రీ భైరవ స్వామి గుడిలో కాలభైరవ స్వామి విగ్రహాన్ని ఎవరో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. 

ఇటీవల కృష్ణా జిల్లాలో ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

read more   అంతర్వేది నూతన రధ నమూనాను పరిశీలించిన స్వరూపానందేంద్ర...పలు సూచనలు (వీడియో)

 అంతర్వేదిలో ఘటనను ఇంకా పూర్తి స్థాయిలో మరువక ముందే ఇలాంటి వరుస సంఘటనలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు ఈ దాడులను నిరిసిస్తూ నిరసన బాట పట్టాయి. ఇలా హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీ రాజకీయాలనూ వేడెక్కిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu