కర్నూల్ లో ఇంటిగ్రేటేడ్ పవర్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

Published : May 17, 2022, 12:37 PM ISTUpdated : May 17, 2022, 03:41 PM IST
కర్నూల్ లో ఇంటిగ్రేటేడ్ పవర్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

సారాంశం

కర్నూల్ జిల్లాలోని గ్రీన్ కోకు చెందిన ఇంటిగ్రేటేడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు శంకుస్థాపన చేశారు. 5410 మెగావాట్ల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.


కర్నూల్:  kurnool  జిల్లా ఓర్వకల్లు మండలం Gummatam తండాలో ఇంటిగ్రేటేడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు శంకుస్థాపన చేశారు. 5410 మెగావాట్ల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కానుంది.

మొత్తం 5,410 మెగా వాట్ల Electricity ను ఉత్పత్తి చేసి నేషనల్‌ గ్రిడ్‌కు అనుసంధానించి ఓరక్వల్లు పీజీసీఐఎల్‌,సీటీయూ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ద్వారా దేశంలోని Discomలు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటే 23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయి. 

Greenko Energies  లిమిటెడ్‌  ఏర్పాటు చేస్తున్న  ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది.  ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి,  550 మెగావాట్లు విండ్‌ పవర్,  1860 మెగావాట్ల  జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద  ఇంటిగ్రేటేడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టుగా ఇది ప్రసిద్ది చెందనుంది.  

also read:పరిహారం అందని ఒక్క రైతును కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడు: సీఎం వైఎస్ జగన్

 ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. కర్నూలులో హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.  'ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయని సీఎం జగన్ వివరించారు. తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా మరో 5 వేల మంది ఉపాధి పొందుతారని సీఎం అన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో 33,240 మెగావాట్ల ప్రాజెక్టులు 

 ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది.  వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది.రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా మొదటి దశలో గండికోట, చిత్రావతి, సోమశిల, ఓక్, కురుకుట్టి, కర్రివలస, యర్రవరంలో శ్రీకారం చుడుతోంది. మొత్తం ఏడుచోట్ల 6,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారవుతోంది.

15 మిలియన్‌ టన్నుల CO2 తగ్గుతుందని కంపెనీ అంచనా  

ఇక పిన్నాపురంలో స్థాపిస్తున్న ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్‌ డయా క్సైడ్‌ 15 మిలియన్‌ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా. 50 లక్షల పెట్రోల్, డీజిల్‌ కార్ల బదులుగా ఎలక్ట్రిక్‌ కార్లను ఉపయోగిస్తే లేదా 25 లక్షల హెక్టార్ల భూమిలో అడవిని పెంచితే వాతావరణంలో ఎంత కార్బన్‌ డయాౖక్సైడ్‌ తగ్గుతుందో ఈ ప్రాజెక్టు ద్వారా అంత తగ్గుతుందని కంపెనీ చెబుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour