ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టు: టీటీడీ సంచలన నిర్ణయం

By narsimha lodeFirst Published Dec 10, 2020, 11:59 AM IST
Highlights

 ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుపై టీటీడీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.
 

తిరుమల: ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుపై టీటీడీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టును కొనసాగించాలని మాజీ టీటీడీ ఛైర్మెన్ తనయుడు డీకే శ్రీనివాస్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను రెండు మాసాల క్రితం కోరాడు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో రూ. 100 కోట్ల అంచనాలతో టీటీడీ ఆనంద నిలయం  అనంత స్వర్ణమయం ప్రాజెక్టును ప్రారంభించింది.  ప్రాజెక్టుకు విరాళంగా 270 మంది దాతలు 95 కేజీల బంగారం, రూ. 13 కోట్లు అందించారు.

కోర్టు తీర్పు మేరకు 2011లో ప్రాజెక్టు నిర్మాణాన్ని టీటీడీ నిలిపివేసింది. విరాళాలను దాతలకు తిరిగి ఇచ్చేసింది. కొందరు భక్తుల కోరిక మేరకు ఈ విరాళాలను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు.  ఇప్పటికే ఈ ప్రాజెక్టు అకౌంట్ లో 60 కేజీల బంగారం రూ. 4.61 కోట్లున్నాయి.

ఈ ప్రాజెక్టుపై గతంలో వచ్చిన కోర్టు తీర్పు కారణంగా కొందరు దాతలు తమ విరాళాలను వెనక్కి తీసుకొన్నారు. ఇలా  కోటి రూపాయాలు, 3 కేజీల బంగారాన్ని దాతలు వెనక్కి తీసుకొన్నారు.

ఇప్పటికీ ప్రాజెక్టు అకౌంట్ లో 60 కిలోల బంగారం, రూ. 4.61 కోట్లున్నాయి.  27 కేజీల బంగారం, రూ. 7.25 కోట్లను దాతలు ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. భక్తుల నుండి స్పందన రాకపోతే మిగిలిన విరాళాన్ని టీటీడీ అకౌంట్ లో జమ చేసుకోవాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకొంది.


 

click me!