రివర్స్ టెండరింగ్, పీపీఏలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Nagaraju penumala  |  First Published Sep 25, 2019, 3:26 PM IST

పోలవరం పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ.782 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు చెప్పుకొచ్చారు. దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్‌ విధానాలు లేవని స్పష్టం చేశారు. 
 


అమరావతి: రివర్స్ టెండరింగ్, పీపీఏ విధానాలపై సీఎం వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలను ఇస్తుందని కొనియాడారు. 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక విధానాలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. 

వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రశంసించారు. 

Latest Videos

పోలవరం పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ.782 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు చెప్పుకొచ్చారు. దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్‌ విధానాలు లేవని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. పారదర్శక విధానాల్లో జ్యుడిషియల్‌ ప్రివ్యూ అత్యుత్తమం అంటూ కొనియాడారు. ఏ రాష్ట్రం కూడా రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేయడంలేదని తమ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుందని తెలిపారు.

పీపీఏల విషయంలోకూడా విప్లవాత్మ విధానాలు అమలు చేస్తున్నట్లు కొనియాడారు. అధికారంలోకి రాగానే విద్యుత్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తే డిస్కంలపై రూ.20వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. 

13 నెలలుగా చెల్లింపులు లేవని స్పష్టం చేశారు. అధిక ధరకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువుగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేస్తున్నారని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. 

పరిశ్రమలకిచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం లేదని స్పష్టం చేశారు. విద్యుత్‌రంగంలో పరిస్థితులను సరిద్దిడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ రంగం పునరుద్దరణకు మీ అందరి సహకారం కావాలి అంటూ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లను సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. 

మరోవైపు రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నట్లు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. 

తమ ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ అని చెప్పుకొచ్చారు. వివిధ వర్గాల ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సమావేశంలో వివరించారు.

ప్రభుత్వం వివిధ పథకాల కింద అనేకమందికి నగదు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలని చెప్పుకొచ్చారు. మా ఆర్థికశాఖతో టచ్‌లో ఉండండి.. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని స్పష్టం చేశారు.

గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సున్నా వడ్డీ కింద చెల్లింపును రశీదు రూపంలో వారికి అందిస్తారని తెలిపారు. సున్నా వడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించాలో తమకు జాబితా ఇస్తే చాలని వాటిని తామే చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. 

ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్లకింద చిరువ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. చిరువ్యాపారులకు ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వం ప్రతినెలా ఒక పథకాన్ని అమలు చేస్తుందని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. అందుకు బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వం ముందుకు వస్తుందని వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

తాము చాలా ప్రోయాక్టివ్‌ గా ఉంటామని స్పష్టం చేశారు. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువుగా ఉందని బ్యాంకు అధికారులు చెప్పడం సంతోషకరమన్నారు. వర్షాలు బాగా పడ్డాయని చెప్పుకొచ్చారు. 

రిజర్వాయర్లలో నీళ్లుకూడా ఉన్నందున రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ మేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పిపిఎల సమీక్షపై విద్యుత్ సంస్థలకు హైకోర్టు షాక్

పీపీఏలపై తప్పుడు ప్రచారం, మేం చెప్పినా వినడం లేదు: జగన్ పై కేంద్రమంత్రి ఆగ్రహం

జగన్ ప్రభుత్వానికి కేంద్రం షాక్

విదేశీ బ్యాంకుల షాక్: పిపిఎల రద్దుపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్

వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్

పీపీఏల వల్ల రాష్ట్రానికి లాభం లేదు.. అందుకే రద్దు చేశాం: జగన్

జగన్ సర్కార్ కు తలనొప్పిగా పీపీఏల అంశం: హైకోర్టులో మరో రెండు పిటీషన్లు

మోదీ ప్రభుత్వంతో సమరానికి జగన్ సై : అగ్గిరాజేస్తున్న పీపీఏ అంశం

సోలార్, విండ్ కంపెనీల నుంచి విద్యుత్ నిలిపివేత: సీఎం జగన్ సంచలన నిర్ణయం

హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

జగన్ సర్కార్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్

click me!