గుడివాడ నియోజకవర్గంలో రూ.799 కోట్లతో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రారంభించారు.
గుడివాడ: రూ.799.19 కోట్లతో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు ప్రారంభించారు. అంతకుముందు టిడ్కో ఇళ్లను ఏపీ సీఎం జగన్ పరిశీలించారు.
టిడ్కో లేఔట్ లో వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మల్లాయపాలెంలో 77 ఎకరాల లేఔట్ లో 8,912 టిడ్కో ఇళ్లను నిర్మించారు.
రూ.657 కోట్లతో గుడివాడ నియోజకవర్గంలో 84 వైఎస్ఆర్ జగనన్న లేఔట్లలో 13,145 ఇళ్ల పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.230 కోట్లతో పేదలందరికీ ఇల్లు కింద 8859 ఇల్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, మౌళిక వసతులతో గుడివాడలో రూ.983 కోట్ల విలువైన ఇళ్లను పేదలకు అందిస్తుంది. 20 ఏళ్లు స్వంత ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది.
2007లో ఇళ్ల స్థలాల కోసం కొడాలి నాని గుడివాడ నుండిహైద్రాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రగా వెళ్లి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కొడాలి నాని వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.పేదలకు టిడ్కో పేరుతో ఏపీ ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తుంది.