ఏపీకి ఐపీఎల్ జట్టు ఉండాలి.. ప్రొఫెషనల్ క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు సీఎస్‌కే మార్గనిర్దేశం: సీఎం జగన్

Published : Jun 16, 2023, 09:51 AM IST
 ఏపీకి ఐపీఎల్ జట్టు ఉండాలి.. ప్రొఫెషనల్ క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు సీఎస్‌కే మార్గనిర్దేశం: సీఎం జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌కు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. భవిష్యత్తులో ఏపీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడగల జట్టును అభివృద్ధి చేసేలా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌కు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. భవిష్యత్తులో ఏపీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడగల జట్టును అభివృద్ధి చేసేలా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో యువజన సర్వీసులు, క్రీడా శాఖ కార్యకలాపాలపై సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలలో ప్రొఫెషనల్ జట్లను అభివృద్ధి చేసే ప్రయత్నంలో అత్యంత విజయవంతమైన ఐపీఎల్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మార్గదర్శకత్వం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

‘‘అంబటి రాయుడు, కెఎస్ భరత్‌లను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది క్రికెటర్లను తీర్చిదిద్దుతాం. ప్రారంభంలో మూడు స్టేడియాల్లో సీఎస్‌కేకు కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తాం. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ జట్టు సహకారం కూడా తీసుకుంటాం’’ అని  ఒక ప్రకటనలో సీఎం  జగన్ పేర్కొన్నారు. 

 


క్రీడల్లో యువతను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘‘ప్లే ఆంధ్ర(ఆడుదాం ఆంధ్ర)’’ రాష్ట్రవ్యాప్త క్రీడా ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని.. ఈ క్రీడా సంబరాలను ప్రతి ఏటా నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక, గ్రామ, మండల, జిల్లా, నియోజకవర్గ స్థాయిలలో నిర్వహించబడిన ఈ క్రీడా ఉత్సవంలో క్రికెట్, కబడ్డీ, వాలీ బాల్, బ్యాడ్మింటన్, ఖో-ఖో, ఇతర క్రీడలు ఉండనున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?